IPL 2026 | మార్ష్ మోత.. బెంగళూరుకు షాకిచ్చిన లక్నో
మిచెల్ మార్ష్ (56 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్స్‌లతో 111) మెరుపు శతకంతో విజృంభించడంతో ఆరు ఓటముల తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ ఎట్టకేలకు ఓ విజయం అందు కుంది. గురువారం జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో ఆ జట్టు.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ను 9 పరుగుల తేడాతో ఓడించింది.
- మిచెల్సూపర్ సెంచరీ..
లక్నో: మిచెల్ మార్ష్ (56 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్స్‌లతో 111) మెరుపు శతకంతో విజృంభించడంతో ఆరు ఓటముల తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ ఎట్టకేలకు ఓ విజయం అందు కుంది. గురువారం జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో ఆ జట్టు.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ను 9 పరుగుల తేడాతో ఓడించింది. పలుమార్లు వరుణుడు అంతరాయం కల్గించగా 19 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో లక్నో నిర్దేశించిన 213 పరుగుల ఛేదనలో బెంగళూరు 203/6 వద్దే ఆగిపోయింది.
రజత్ పాటీదార్ (31 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 61), టిమ్ డేవిడ్ (17 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40) పోరాడారు. మొదట ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మిచెల్ మార్ష్ సెంచరీకి తోడు నికోలస్ పూరన్ (23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 38), రిషభ్ పంత్ (10 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో లక్నో 19 ఓవర్లకు 209/3 పరుగుల భారీ స్కోరు సాధించింది.
మార్ష్ శతక జోరు
లక్నో ఇన్నింగ్స్‌లో మార్ష్ ఆటే హైలైట్. పవర్ ప్లేలోనే భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. హాజిల్‌వుడ్ ఓవర్లో రెండు సిక్స్‌లతో వేట మొదలెట్టిన ఈ హార్డ్ హిట్టర్.. కృనాల్‌కు 4, 6తో స్వాగతం పలికాడు. రసిఖ్ ఐదో ఓవర్లో 97 మీటర్ల భారీ సిక్స్‌కు తోడు మరో రెండుసార్లు బంతిని బౌండరీ లైన్ దాటించాడు. హాజిల్‌వుడ్ వేసిన పవర్‌ప్లే ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలు బాదిన అతడు.. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. కృనాల్.. అర్షిన్(17)ను ఔట్ చేయడంతో 95 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అతడే వేసిన 13వ ఓవర్లో సిక్స్‌తో 90లలోకి వచ్చిన మార్ష్.. షెఫర్డ్ బౌలింగ్‌లో వరుస ఫోర్లతో 50 బంతుల్లో సెంచరీని పూర్తిచేశాడు. ఈ లీగ్‌లో మార్ష్‌కు ఇది రెండో శతకం. మార్ష్ నిష్క్రమించినా ఆఖర్లో పూరన్, పంత్ మెరుపులతో లక్నోకు అదిరిపోయే ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.
బెంగళూరు పోరాడినా..
భారీ ఛేదనలో షమీ, ప్రిన్స్ ఆరంభ ఓవర్లలో విజృంభించడంతో బెంగళూరు మొదటి 8 బంతుల్లోనే బెతెల్ (4), కోహ్లీ (0) వికెట్లను కోల్పోయింది. 9 రన్స్‌కే ఓపెనర్లను నష్టపోయిన ఆర్సీబీని పడిక్కల్, రజత్ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఆరంభంలో నెమ్మదిగా ఆడినా క్రీజులో కుదురుకున్నాక బ్యాట్ ఝుళిపించారు. దిగ్వేశ్‌ను లక్ష్యంగా చేసుకున్న రజత్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అయితే సాఫీగా సాగుతున్న ఆర్సీబీ ఇన్నింగ్స్‌కు ప్రిన్స్ తన మూడో ఓవర్లో.. పడిక్కల్, జితేశ్ (1)ను ఔట్ చేసి డబుల్ షాకులిచ్చాడు.
12వ ఓవర్లో బంతినందుకున్న షాబాజ్.. కెప్టెన్‌ను బోల్తా కొట్టించాడు. చివరి ఐదు ఓవర్లలో ఆర్సీబీ విజయానికి 80 రన్స్ అవసరమున్న దశలో ప్రమాదకర టిమ్ డేవిడ్ భారీ సిక్స్‌లతో భయపెట్టి ఆర్సీబీ శిబిరంలో ఆశలు రేపాడు. కానీ షాబాజ్ అతడిని ఔట్ చేశాడు. కృనాల్ (28 నాటౌట్), షెఫర్డ్ (23 నాటౌట్) ఆ బాధ్యత తీసుకున్నా ఈ ద్వయం తమ జట్టును గెలుపు తీరాలకు చేర్చలేకపోయింది.
సంక్షిప్త స్కోర్లు
లక్నో: 19 ఓవర్లకు 209/3 (మార్ష్ 111, పూరన్ 38, కృనాల్ 1/31, హాజిల్‌వుడ్ 1/49);
బెంగళూరు: 19 ఓవర్లకు 203/6 (రజత్ 61, డేవిడ్ 40, ప్రిన్స్ 3/33, షాబాజ్ 2/33)

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

