కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (9) విఫలమయ్యాడు. కృనాల్ పాండ్యా వేసిన 11వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన మ్యాక్స్‌వెల్.. డీప్‌స్క్వేర్ లెగ్ వైపు కొట్టాడు. అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఎవిన్ లూయిస్ చక్కని క్యాచ్ అందుకోవడంతో మ్యాక్స్‌వెల్ పెవిలియన్ చేరాడు. దీంతో 86 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన బెంగళూరు కష్టాల్లో పడింది.