కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డీకాక్ అదరగొడుతున్నాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (0) ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రనౌట్ అవడంతో.. అతని బాధ్యత కూడా తీసుకున్న డీకాక్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అతనికి జత కలిసిన దీపక్ హుడా (22 నాటౌట్) కూడా రాణించడంతో లక్నో జట్టు పవర్‌ప్లే ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది.