IPL 2026 : పంతొమ్మిదో సీజన్లో వరసగా రెండు విజయాలతో జోరుమీదున్న లక్నో సూపర్ జెయింట్స్ (LSG)కు బిగ్ షాక్. గాయంతో బాధ పడుతున్న వనిందు హసరంగ(Wanindu Hasaranga) మెగా టోర్నీకి దూరమయ్యాడు. శ్రీలంక వెటరన్ పంతిమ్మిదో సీజన్ ఆడడం లేదని ఎల్ఎస్జీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ టామ్ మూడీ వెల్లడించారు. హసరంగ స్థానంలో దక్షిణాఫ్రికా యువకెరటం జార్జ్ లిండే(Jeorge Linde)ను తీసుకున్నామని ఆయన తెలిపాడు.
శ్రీలంక మాజీ కెప్టెన్ వనిందు హసరంగ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఇటీవల పొట్టి ప్రపంచకప్‌లో గాయపడిన ఈ మిస్టరీ స్పిన్నర్ పూర్తిగా కోలుకోలేదు. దాంతో, అతడు శ్రీలంక బోర్డు నిర్దేశించిన ఫిట్నెస్ ప్రమాణాలను అందుకొని.. ఐపీఎల్ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి పంతొమ్మిదో సీజన్‌కు తాను అందుబాటులో ఉండడంపై లక్నో యాజమాన్యానికి హసరంగ హామీ ఇవ్వలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో అతడి బదులు జార్జ్ లిండేను తీసుకుంది లక్నో.
Lucknow mein swagat hai, George Linde ❤️💙
The Protea all-rounder replaces Wanindu Hasaranga in our squad for #TATAIPL 2026 pic.twitter.com/CZaSypy7ZR
— Lucknow Super Giants (@LucknowIPL) April 10, 2026
‘ఈ సీజన్‌కు హసరంగ అందుబాటులో ఉండడనే విషయాన్ని మేము అర్ధం చేసుకుంటున్నాం. అతడి స్థానంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జార్జ్ లిండేను తీసుకున్నాం’ అని టామ్ మూడీ వెల్లడించాడు. నిరుడు అబుధాబీలో జరిగిన మినీ వేలంలో హసరంగను రూ.2 కోట్లకు దక్కించుకుంది లక్నో. కానీ, టీ20 ప్రపంచకప్‌లో తొడ కండరాల గాయంతో అతడు క్రికెట్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్లోపైనా కోలుకుంటాడని ఆశించిన లక్నోకు నిరాశే మిగిలింది.
🚨 Replacement alert 🚨
George Linde replaces the 28-year-old Wanindu Hasaranga in the LSG setup.
He has been ruled out of the T20 World Cup 2026 with a hamstring injury and did not undergo the mandatory fitness test required to obtain the No-Objection Certificate needed to… pic.twitter.com/EIxHd0mMU0
— Sportstar (@sportstarweb) April 10, 2026
ఓటమితో పంతొమ్మిదో సీజన్‌ను ఆరంభించిన లక్నో సూపర్ జెయింట్స్ వరసగా విజయాలతో జోరందుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో గెలుపొందిందింది లక్నో. ప్రస్తుతం దిగ్వేశ్ రథీ, సిద్దార్థ్, షహబాజ్ అహ్మద్, జార్జ్ లిండేలతో లక్నో స్పిన్ దళం పటిష్టంగానే ఉంది.