Lionel Messi | మెస్సీ హోటల్ గది ఇకపై మినీ మ్యూజియం
వరల్డ్ కప్ సందర్భంగా మెస్సీ బీ201 గదిలో ఉన్నాడు
Lionel Messi : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన లియోనల్ మెస్సీకి అరుదైన గౌరవం లభించనుంది. వరల్డ్ కప్ సందర్భంగా అతను బస చేసిన హోటల్ గది ఇకపై పర్యాటకులను ఆకర్షించనుంది. మెస్సీ ఉన్న రూమ్‌ను అధికారులు మినీ మ్యూజియంగా మార్చనున్నారు. వరల్డ్ కప్ సందర్భంగా మెస్సీ బీ201 గదిలో ఉన్నాడు. ‘లియోనల్ మెస్సీ బస చేసిన గదిలో ఎలాంటి మార్పులు చేయం. ఆ రూమ్ అలానే ఉంటుంది. అంతేకాదు అందులోకి సందర్శకులను మాత్రమే అనుమతిస్తాం’ అని ఖతర్ యూనివర్సిటీ కమ్యూనికేషన్స్, పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ హిత్మి అల్ హిత్మి వెల్లడించారు. మెస్సీ గదికి సంబంధించిన వీడయోను ఖతర్ యూనివర్సిటీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
మెస్సీ, సెర్గియో అగెరో బీ201 గదిని షేర్ చేసుకున్నారు. ట్రోఫీ అందుకున్న తర్వాత మెస్సీ, జట్టు సభ్యులతో కలిసి ఇదే గదిలో సంబరాలు చేసుకున్నాడు. దాంతో, మెస్సీ, అర్జెంటీనా విజయానికి గుర్తుగా ఈ గదిని ఖతర్ యూనివర్సిటీ అధికారులు చిన్నపాటి మ్యూజియంగా చేయలనుకున్నారు. దాంతో, ఇకపై ఎవరూ ఈ రూమ్‌ను బుక్ చేసుకోవడం కుదరదు. ఆ గదిలో అర్జెంటీనా జట్టు సభ్యుల ఫొటోలు, వాళ్ల గెలుపు సంబరాల గుర్తులు ఇకపై సందర్శకులను ఆకట్టుకోనున్నాయి.
హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఫుట్‌బాల్ చరిత్రలో గొప్ప మ్యాచ్‌గా గుర్తింపు పొందింది. ఫైనల్లో అర్జెంటీనా షూటౌట్లో 4-2తో ఫ్రాన్స్‌పై గెలుపొందింది. ఎంబాపే హ్యాట్రిక్ గోల్స్ కొట్టి హడలెత్తించాడు. అత్యధికంగా 8 గోల్స్ చేసిన అతనికి గోల్డెన్ బూట్ అవార్డు లభించింది. మెస్సీ 7 గోల్స్‌తో రెండో స్థానంలో నిలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

