Lionel Messi: రెండు గోల్స్ కొట్టిన మెస్సీ.. అర్జెంటీనా విజయం.. వీడియో
Lionel Messi: మెస్సీ తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. పెరూతో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ చేశాడు. దీంతో ఆ జట్టుపై అర్జెంటీనా విజయం సాధించింది. మెస్సీ డ్రిబ్లింగ్ గేమ్‌తో పెరూ ఆటగాళ్లు పరేషాన్ అయ్యారు.
లీమా: అర్జెంటీనా ప్లేయర్ మెస్సీ మళ్లీ మాయ చేశాడు. పెరూతో జరిగిన 2026 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో దుమ్మురేపాడు. ఆ మ్యాచ్‌లో అర్జెంటీనా 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. లీమాలో జరిగిన మ్యాచ్‌లో .. ఆ రెండు గోల్స్ మెస్సీనే చేశాడు. అద్భుతమైన రీతిలో ఆటను ప్రదర్శించాడు. 36 ఏళ్లు మెస్సీ ఓ దశలో తన డ్రిబుల్ గేమ్‌తో ఇద్దరు పేరూ ప్లేయర్లను ఆటాడుకున్నాడు. పరాగ్వేతో జరిగిన మ్యాచ్‌కు దూరంగా ఉన్న మెస్సీ.. పెరూతో మ్యాచ్‌లో పూర్తి సమయం ఆడాడు. ఇటీవల కుడి కాలుకు గాయం కావడంతో చాన్నాళ్లు అతను ఆటకు దూరంగా ఉన్నాడు. పెరూతో మ్యాచ్‌లో 32వ నిమిషంలో తొలి గోల్ చేసిన మెస్సీ.. ఆ తర్వాత 10 నిమిషాలకే మరో గోల్ కొట్టాడు.
Messi 😍 #ARGvsPER #Messi𓃵 #WCQualifiers pic.twitter.com/HLJi6J4uEF
— FanCode (@FanCode) October 18, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Argentina
- goals
- Lionel Messi
- Peru
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

