Lionel Messi : ఆర్జెంటీనాకు మూడో వరల్డ్ కప్ అందించిన లియోనల్ మెస్సీ వచ్చే వరల్డ్ కప్ కూడా ఆడాలని అభిమానులందరూ కోరుకుంటున్నారు. అయితే.. అతను మాత్రం ఫ్యాన్స్‌ను నిరాశ పరిచే వార్త చెప్పాడు. ఆ మెగా టోర్నీలో ఆడడంపై తాజాగా స్పందించిన మెస్సీ వయసురీత్యా తాను 2026 వరల్డ్ కప్‌లో ఆడడం కష్టమే అని అన్నాడు. ‘నాకు ఫుట్‌బాల్ ఆడడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నా శరీరం సహకరిస్తోంది కాబట్టి ఆటను ఆస్వాదిస్తున్నా. అయితే.. 2026 వరల్డ్ కప్‌లో ఆడడం వయసురీత్యా నాకు కష్టమే’ అని మెస్సీ తెలిపాడు. ఇప్పుడు మెస్సీకి 35 ఏళ్లు. 2026 ఫిఫా వరల్డ్ కప్ వచ్చే సరికి అతనికి 38 ఏళ్లు
వస్తాయి.
8 ఏళ్ల కల నిజమైంది
మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఛాంపియన్‌గా అవతరించింది. మూడోసారి వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. ఉత్కంఠ పోరులో షూటౌట్లో 4-2తో ఫ్రాన్స్‌ను ఓడించింది. మెస్సీ రెండు గోల్స్ కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడాలన్న తన 8 ఏళ్ల కలను ఈ స్టార్ ప్లేయర్ నిజం చేసుకున్నాడు. 2014లో మెస్సీ అర్జెంటీనాను ఫైనల్ చేర్చాడు. కానీ, ఫైనల్లో జర్మనీ కప్పు ఎగరేసుకుపోయింది.