Lewis Hamilton : ఫార్ములా వన్ దిగ్గజం లెవిస్ హమిల్టన్(Lewis Hamilton) మళ్లీ పాత కారుకు మారాడు. ప్రముఖ కంపెనీ మెర్సిడెస్(Meredes)తో రెండేళ్ల కాలానికి ఒప్పందం చేసుకున్నాడు. ఈ కాంట్రాక్ట్ విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు. హమిల్టన్, మెర్సిడెస్ మధ్య 63.41మిలియన్ డాలర్ల భారీ డీల్ కుదిరింది. మన కరెన్సీలో రూ. 500 కోట్లు అన్నమాట. అయితే.. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మెర్సిడెస్‌తో ఒప్పందం గురించి హమిల్టన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘మేము విజయం కోసం ఇప్పుడే ఆరాటపడడం లేదు. మేము ప్రతి గెలుపు నుంచి ఎంతో నేర్చుకుంటాం. ఓటమికి దారి తీసిన అంశాలపై విశ్లేషణ చేసుకుంటాం. మా లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం. ఎంత పెద్ద సవాల్ అయినా సరే విజయం కోసం పోరాడుతాం. ట్రాక్ మీద, బయట నాకు అన్నివిధాల సహకరించిన టీమ్‌కు ధన్యవాదాలు. మెర్సిడెస్‌తో కలిసి మరిన్ని అద్భుతాలు చేయాలనుకుంటున్నాం. మేము అనుకున్నది సాధించే వరకు విశ్రమించం’ అని హమిల్టన్ వెల్లడించాడు.
లెవిస్ హమిల్టన్
బ్రిటన్‌కు చెందిన హమిల్టన్ 2013లో మెక్లారెన్(McLaren)ను వీడి మెర్సిడెస్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాడు. ఆ తర్వాత అతను ఆరు ప్రపంచ టైటిళ్లు సాధించాడు. ఫార్ములా వన్ రేసులో విజయవంతమైన డ్రైవర్‌గా పేరొందిన హమిల్టన్ ఇప్పటివరకూ ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచాడు. అంతేకాదు కెరీర్లో 103 రేసుల్లో పాల్గొన్నాడు. ఏకంగా 82 సార్లు విజేతగా నిలిచాడు.