మ్యాడ్రిడ్ (స్పెయిన్): టెన్నిస్ యువ సంచలనం కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్), మహిళల టాప్ సీడ్ అరీనా సబలెంకా (బెలారస్) క్రీడల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన లారియస్ అవార్డులను గెలుచుకున్నారు. 2025లో రెండు గ్రాండ్‌స్లామ్ (ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్)లను గెలుచుకోవడంతో పాటు ప్రపంచ నెంబర్‌వన్ ర్యాంకును దక్కించుకున్న అల్కరాజ్కు ‘వరల్డ్ స్పోర్ట్స్‌మెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇక సబలెంకా.. నిరుడు యూఎస్ ఓపెన్‌ను నెగ్గడమే గాక ఆస్ట్రేలియా, ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఆమెకు ‘వరల్డ్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కింది. ‘వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్’గా ప్రముఖ ఫుట్‌బాల్ జట్టు పారిస్ సెయింట్ జర్మన్ (పీఎస్జీ) ఎంపికైంది. ఈ క్యాటగిరీలో పోటీపడ్డ భారత మహిళల జట్టుకు నిరాశ ఎదురైంది.