DCW vs UPWW | యూపీ, ముంబై ఆశలు ఆవిరి.. ఢిల్లీదే చివరి బెర్తు..!
DCW vs UPWW : డబ్ల్యూపీఎల్‌లో మూడుసార్లు ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో సీజన్లోనూ ప్లే ఆఫ్స్ చేరింది. గత మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో గుజరాత్ చేతిలో ఓడిన ఢిల్లీ.. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ను చిత్తు చేసింది.
DCW vs UPWW : డబ్ల్యూపీఎల్‌లో మూడుసార్లు ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో సీజన్లోనూ ప్లే ఆఫ్స్ చేరింది. గత మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో గుజరాత్ చేతిలో ఓడిన ఢిల్లీ.. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ను చిత్తు చేసింది. మొదట బౌలర్ల విజృంభణతో ప్రత్యర్ధిని 122కే కట్టడి చేసి.. ఆపై లారా వొల్వార్డ్త్(47), జెమీమా రోడ్రిగ్స్(34 నాటౌట్) మెరుపులతో జయభేరి మోగించింది. 5 వికెట్ల తేడాతో గెలిచిన ఢిల్లీ ఎలిమినేటర్‌కు అర్హత సాధించింది.
చావోరేవో పోరులో ఢిల్లీ సమిష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. స్వల్ప ఛేదనలో ఢిల్లీ ఓపెనర్ లిజెల్లీ లీ(10) త్వరగానే వెనుదిరిగింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన లారా వొల్వార్డ్త్(47).. దూకుడుగా ఆడింది. డేంజరస్ షఫాలీ వర్మ(29)ను శిఖా పాండే ఓవర్లో తేలికైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్(34 నాటౌట్), సోఫీ ఎకిల్‌స్టోన్ ఓవర్లో మరినేకాప్(0) సైతం చెత్త షాట్‌తో వికెట్ పారేసుకుంది. దాంతో.. 28 బంతుల్లో 25 అసవరమయ్యాయి.
𝙍𝙤𝙖𝙧𝙞𝙣𝙜 into the Playoffs 💙❤️
The Jemimah Rodrigues-led @DelhiCapitals are #Eliminator bound 🥳#TATAWPL | #ClaimTheCrown | #DCvUPW pic.twitter.com/3oWGpgIsVb
— Women’s Premier League (WPL) (@wplt20) February 1, 2026
హిట్టర్ చిన్నెలీ హెన్రీ సైతం ఇబ్బంది పడింది. ఆమెను దీప్తి రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ పంపగా ఒత్తిడి పడింది. కానీ, గత మ్యాచ్‌లో చివరిదాకా పోరాడిన నిక్కీ ప్రసాద్(4 నాటౌట్).. అండగా జట్టును విజయ తీరాలకు చేర్చింది జెమీమా. దీప్తి వేసిన 19వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు ధించి 5 వికెట్లతో గెలిచిన ఢిల్లీ 8 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో యూపీ గెలిస్తే ముందంజ వేయాలనుకున్న ముంబై ఇండియన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Exquisite timing 👌
Laura Wolvaardt found the gaps to perfection 😎
Updates ▶️ https://t.co/KvgnknNkQ7 #TATAWPL | #KhelEmotionKa | #DCvUPW | @DelhiCapitals pic.twitter.com/EkzrfYVEDz
— Women’s Premier League (WPL) (@wplt20) February 1, 2026
శిఖా, దీప్తి మెరుపులు..
టాస్ ఓడిన యూపీ వారియర్స్‌కు బ్యాటర్ల వైఫల్యంతో స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. మరినే కాప్(3-30), శ్రీ చరణి(2-22), చిన్నెలె హెన్రీ (2-25)లు దెబ్బతీయడంతో యూపీ ఇన్నింగ్స్ ఆద్యంతం తడబడుతూనే సాగింది. ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ల దీప్తి శర్మ(24), సిమ్రాన్ శక్తి(22)లు రాణించారు. ఆఖర్లో శిఖా పాండే(23 నాటౌట్) మెరుపులతో యూపీ స్కోర్ 120 దాటింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 రన్స్ చేసిందంతే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

