Thomas Cup | అదరగొట్టిన లక్ష్య సేన్, ఆయుశ్.. సెమీఫైనల్లో భారత్..!
Thomas Cup : ప్రతిష్ఠాత్మక థామస్ కప్‌లో భారత షట్లర్లు అదరగొట్టారు. లక్ష్య సేన్(Lakshya Sen), ఆయుశ్ శెట్టి (Ayush Shetty)లు రాణించడంతో టీమిండియా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
Thomas Cup : ప్రతిష్ఠాత్మక థామస్ కప్‌లో భారత షట్లర్లు అదరగొట్టారు. లక్ష్య సేన్(Lakshya Sen), ఆయుశ్ శెట్టి (Ayush Shetty)లు రాణించడంతో టీమిండియా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషల సింగిల్స్‌లో ఈ ఇద్దరూ, డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ద్వయం చెలరేగడంతో చైనీస్ తైపీపై 3-0 విజయంతో భారత్ పతకానికి చేరువైంది.
డెన్మార్క్ వేదికగా జరుగుతున్న థామస్ కప్ కీలక మ్యాచ్‌లో భారత షట్లర్లు తడాఖా చూపించారు. క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి, సాత్విక్ – చిరాగ్ జోడీ టాప్ గేర్‌లో ఆడడంతో చైనీస్ తైపీపై 3-0తో విజయం సాధించింది టీమిండియా. తొలుత సేన్ సింగిల్స్‌లో అతికష్టమ్మీద నెగ్గాడు. చౌ థియెన్ చెన్ ధాటికి తొలిసెట్ కోల్పోయినా పట్టువదలని భారత ఆటగాడు రెండో సెట్‌ను 22-10తో గెలుచుకున్నాడు.
#SENmode 🔛🔥💪#ThomasUberCupFinals #Horsens2026 pic.twitter.com/PWB1wHlVfE
— BWF (@bwfmedia) May 1, 2026
నిర్ణయాత్మక మూడో సెట్లోనూ సేన్ అటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. సెట్ ఆసాంతం జోరు చూపించి 21-17తో గెలుపొంది ఆధిక్యాన్ని 1-0కు పెంచాడు. డబుల్స్‌లో సాత్విక్ చిరాగ్ ద్వయం చియు షియాంగ్ – వాంగ్ చి లిన్ జంటను చిత్తు చేసింది. నెట్ వద్ద చురుకుగా కదిలిన భారత జోడీ.. 23-11, 19-21, 21-12తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
ఛాంపియన్‌కు చెక్ పెట్టి..
ఇటీవలే ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన ఆయుశ్ శెట్టి సైతం విజయంతో చైనీస్ తైపీ ఆశలపై నీళ్లు చల్లాడు. 48 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో అతడు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్ లిన్ చున్ యూని మట్టికరిపించాడు. 21-16, 21-17తో లిన్‌పై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన ఆయుశ్ భారత్ ఆధిక్యాన్ని 3-0కు పెంచగా.. సెమీస్ బెర్తు ఖాయమైంది.
Exceptional rally! 🏸
Follow live action: https://t.co/TjoFnU4PnB
#ThomasUberCupFinals #Horsens2026 pic.twitter.com/XRsHNmNP9O— BWF (@bwfmedia) May 1, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

