IND vs ENG 5th Test | ఇంగ్లండ్‌ను కుప్పకూల్చిన కుల్దీప్.. నాలుగు వికెట్లతో మెరిసిన అశ్విన్
IND vs ENG 5th Test : ధర్మశాల టెస్టులో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav), రవిచంద్రన్ అశ్విన్(R Ashwin)లు తిప్పేశారు. టర్నింగ్ పిచ్ మీద భారత స్పిన్ త్రయం ధాటికి పర్యాటక జట్టు బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో, ఇంగ్లండ్ జట్టు...
IND vs ENG 5th Test : ధర్మశాల టెస్టులో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav), రవిచంద్రన్ అశ్విన్(R Ashwin)లు తిప్పేశారు. టర్నింగ్ పిచ్ మీద భారత స్పిన్ త్రయం ధాటికి పర్యాటక జట్టు బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో, ఇంగ్లండ్ జట్టు 218 పరుగులకే ఆలౌటయ్యింది. ఓపెనర్ జాక్ క్రాలే(79 ) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కీరీర్లో వందో టెస్టు ఆడుతున్న అశ్విన్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. దాంతో స్టోక్స్ సేన భారీ స్కోర్ చేయలేకపోయింది.
𝗠𝗶𝗹𝗲𝘀𝘁𝗼𝗻𝗲 𝗔𝗻𝗱 𝗠𝗲𝗺𝗼𝗿𝗶𝗲𝘀 – 𝗳𝘁. 𝗣𝗿𝗶𝘁𝗵𝗶 𝗔𝘀𝗵𝘄𝗶𝗻! ☺️#TeamIndia | #INDvENG | @ashwinravi99 | @prithinarayanan | @IDFCFIRSTBank pic.twitter.com/kIhho9q4uY
— BCCI (@BCCI) March 7, 2024
తొలి సెషన్ నుంచే ధర్మశాల పిచ్ స్పిన్‌కు అనుకూలించింది. దాంతో, కుల్దీప్ తన లెగ్‌బ్రేక్, గూగ్లీలతో ఇంగ్లండ్ బ్యాటర్లను వణికించాడు. శుభ్‌మన్ గిల్ సూపర్ క్యాచ్‌తో బెన్ డకెట్(27)ను వెనక్కి పంపిన కుల్దీప్.. ఆ తర్వాత జోరు పెంచాడు. తన వికెట్ల వేట ప్రారంభించిన కుల్దీప్.. ఆ తర్వాత ఉప్పల్ టెస్టు హీరో ఓలీ పోప్(11)ను ఔట్ చేశాడు.
ఒకే ఓవర్లో రెండు వికెట్లు
లంచ్ తర్వాత భీకర ఫామ్‌లో ఉన్న క్రాలే(79)ను కుల్దీప్ సూపర్ డెలివరీతో బౌల్డ్ చేశాడు. భారీ షాట్లతో కౌంటర్ అటాక్ చేస్తున్న డేంజరస్ జానీ బెయిర్‌స్టో(29), బెన్ స్టోక్స్(0)లను ఔట్ చేసి 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. రాంచీ టెస్టు హీరో జో రూట్(26)ను జడేజా వెనక్కి పంపాడు.
I. C. Y. M. I!
1⃣ Over
2⃣ Wickets
2⃣ Brilliant Catches
R Ashwin 🤝 Devdutt Padikkal 🤝 Rohit Sharma
Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @ashwinravi99 | @devdpd07 | @ImRo45 | @IDFCFIRSTBank pic.twitter.com/TDfvYLRDEo
— BCCI (@BCCI) March 7, 2024
కుల్దీప్ విజృంభణతో పీకల్లోతు కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఒకే ఓవర్లో టామ్ హర్ట్లే(6), మార్క్ వుడ్(0)లను అశ్విన్ పెవిలియన్ పంపాడు. 194/8 తో టీకి వెళ్లిన ఇంగ్లండ్ ఆ తర్వాత కాసేపటికే అశ్విన్ స్పిన్ ఉచ్చులో పడి చివరి రెండు వికెట్లు కోల్పోయింది.
ఇవి కూడా చదవండి
- Niranjan Reddy | పనిపైనే దృష్టి పెట్టి పాలన సాగించిన ఘనత కేసీఆర్‌దే : నిరంజన్ రెడ్డి
- CM Revanth | రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ భూమిపూజ
- Telangana | తెలంగాణలో 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

