Lords Test | 6 పరుగులకే డగౌట్లో ఇంగ్లండ్ ఓపెనర్లు.. గెలుపు దిశగా భారత్..!
Lords Test : లార్డ్స్ టెస్టులో జోరు చూపిస్తున్న భారత జట్టు విజయం దిశగా అడుగులు వేస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో రెచ్చిపోయిన క్రాంతి గౌడ్(1-7).. మళ్లీ ఇంగ్లండ్‌ను వణికిస్తూ వికెట్ల వేట ఆరంభించింది.
Lords Test : లార్డ్స్ టెస్టులో జోరు చూపిస్తున్న భారత జట్టు విజయం దిశగా అడుగులు వేస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో రెచ్చిపోయిన క్రాంతి గౌడ్(1-7).. మళ్లీ ఇంగ్లండ్‌ను వణికిస్తూ వికెట్ల వేట ఆరంభించింది. డిఫెన్స్ ఆడాలనుకున్న ఓపెనర్ టమ్మీ బ్యూమంట్(0)ను ఇన్ స్వింగర్‌తో క్లీన్ బౌల్డ్ చేసిందీ పేసర్. సయాలీ సత్ఘరే(1-2) ఓవర్లో మైయా బౌచియర్(2) వెనుదిరగగా.. 6 పరుగులకే ఓపెనర్లను కోల్పయింది ఆతిథ్య జట్టు.
లంచ్ తర్వాత భారత జట్టు 341 /7 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాక ఆట మొదలెట్టిన ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఓపెనర్లు టమ్మీ బ్యూమంట్(0), మైయా బౌచియర్(2)లు 6 పరుగులకే ఔటయ్యారు. ప్రస్తుతం కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్(6 నాటౌట్), హీథర్ నైట్(6 నాటౌట్)లు జాగ్రత్తగా ఆడుతున్నారు.
Fast bowling simply doesn’t get any better than this 🔥
Kranti Gaud & Sayali Satghare with dream deliveries to dismiss both England openers early 👊
Updates ▶️ https://t.co/O1rEau8j8n #TeamIndia | #ENGvIND pic.twitter.com/gZK4SozP4s
— BCCI Women (@BCCIWomen) July 12, 2026
మరో 48 ఓవర్లు ఉన్నందున.. చెరొక వికెట్ తీసిన క్రాంతి గౌడ్(7-1), సయాలీ సత్ఘరే(1-2) ధాటికి ఇంగ్లండ్ కుప్పకూలడం ఖాయమనిపిస్తోంది. వీడ్కోలు మ్యాచ్‌లో డకౌటైన టమ్మీ బ్యూమంట్కు భారత క్రికెటర్లు, అంపైర్లు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తూ.. కరచాలనం చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

