Virat Kohli : లండన్‌ను తన రెండో ఇల్లుగా మార్చుకున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) వన్డేలుంటే తప్ప భారత్‌కు రావడం లేదు. కుటుంబంతో అక్కడే స్థిరపడిన కోహ్లీ ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్క్వాడ్‌తో కలిశాడు. ప్రాక్టీస్ సెషన్లో సహచరుల్లో స్ఫూర్తి నింపిన విరాట్.. తాను సీజన్ మధ్యలో లండన్‌కు చార్టర్ ఫ్లయిట్ డిమాండ్ చేశాననే వార్తల్ని కొట్టిపారేశాడు. ఆదివారం ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ నవ్వుతున్న ఎమోజీలు పోస్ట్‌తో అవన్నీ వదంతులే అని తేల్చేశాడీ ఆర్సీబీ మాజీ సారథి.
ఐపీఎల్లో 18 ఏళ్లుగా ఆర్సీబీకే ఆడుతున్న విరాట్ కోహ్లీ నిరుడు తన కలను నిజం చేసుకున్నాడు. రెండుసార్లు ఫైనల్లో తడబడిన బెంగళూరు మూడో ప్రయత్నలో విజేతగా నిలవడంతో కోహ్లీ భావోద్వేగానికి లోనవ్వడం చూశాం. డిఫెండింగ్ ఛాంపియన్‌గా పంతొమ్మిదో సీజన్లో ఆడనున్న బెంగళూరు జట్టుకు కఠిన సవాళ్లు ఎదురవుతాయని సహచరులను కోహ్లీ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో అతడిపై కొన్ని వదంతులు సోషల్ మీడియాలో వ్యాపించాయి.
🚨Virat Kohli latest Insta story 🚨
A tight slap on all the media accounts who spread fake news for engagement. pic.twitter.com/bxciKKJsvo
— Dive (@crickohlic) March 22, 2026
మ్యాచ్ విరామాల్లో లండన్ వెళ్లి వచ్చేలా ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని ఫ్రాంచైజీని డిమాండ్ చేశాడనే వార్తలు వైరలయ్యాయి. ‘ఆర్సీబీ మ్యాచ్‌లకు మూడు రోజుల విరామం లభిస్తే లండన్ వెళ్లాలని అతడు భావిస్తున్నాడు. మరుసటి మ్యాచ్‌కు ముందురోజు భారత్‌కు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు’ అని కొన్ని కథనాలు వచ్చాయి.
ఈ వార్తలను చూసి నవ్వుకున్న కోహ్లీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో రెండు లాఫింగ్ ఎమోజీస్ పెట్టాడు. తద్వారా తానేమీ చార్టర్ ఫ్లయిట్ కోరలేదని, ఎవరో పనిగట్టుకుని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని కోహ్లీ చెప్పకనే చెప్పాడిలా. మార్చి 28 నుంచి మొదలయ్యే పంతొమ్మిదో సీజన్ ఆరంభ పోరులో ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ కొననున్నాయి.
👑🔥 THE KING IS BACK IN THE NETS 🔥👑
Virat Kohli begins his first practice session ahead of IPL 2026… and the intensity is already on another level 💯
RCB fans, get ready — something BIG is loading. ❤️🏏#ViratKohli #KingKohli #IPL2026 #RCB pic.twitter.com/CzTzzZPjNb
— ND Sport (@SportsByND) March 18, 2026