IPL 2023 : టాస్ గెలిచిన ఆర్సీబీకి శుభారంభం దక్కింది. ఫాఫ్ డూప్లెసిస్(45), విరాట్ కోహ్లీ(55) అద్భుత ఆరంభం ఇచ్చారు. మహిపాల్ లోమ్రోర్(54 నాటౌట్) హాఫ్ సెంచరీ తో చెలరేగాడు. దాంతో ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. ఖలీల్ అహ్మద్ వేసిన 20వ ఓవర్ తొలి బంతికి దినేశ్ కార్తిక్(11) ఔటయ్యాడు. కార్తిక్ కొట్టిన బంతిని బౌండరీ దగ్గర వార్నర్ అందుకున్నాడు. రెండో బంతికి అనుజ్ రావత్(8) సిక్స్ బాదాడు. ఆఖరి బాల్‌కు పరుగు రాకపోవడంతో ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. మహిపాల్ లోమ్రోర్(54) నాటౌట్‌గా నిలిచాడు.
టాస్ గెలిచిన ఆర్సీబీకి శుభారంభం దక్కింది. ఫాఫ్ డూప్లెసిస్(45), విరాట్ కోహ్లీ(55) అద్భుత ఆరంభం ఇచ్చారు. మహిపాల్ లోమ్రోర్(54 నాటౌట్) హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే.. మిచెల్ మార్ష్ వరుస బంతుల్లో ఫాఫ్ డూప్లెసిస్(45), మ్యాక్స్‌వెల్(0)ను ఔట్ చేశాడు. దాంతో, 82 రన్స్ వద్ద ఆర్సీబీ రెండు ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మహిపాల్ లోమ్రోర్(34) హ్యాట్రిక్ బంతికి సింగిల్ తీశాడు. హాఫ్ సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీ(55) ధాటిగా ఆడే క్రమంలో ఖలీల్ అహ్మద్ చేతికి చిక్కాడు.