Ranchi ODI | చెలరేగిన కోహ్లీ, కుల్దీప్.. ఉత్కంఠ పోరులో టీమిండియాదే విజయం..!
Ranchi ODI : టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ నుంచి తేరుకున్న భారత జట్టు వన్డే సిరీస్‌లో బోణీ కొట్టింది. రాంచీ మైదానంలో ఉత్కంఠగా సాగిన పోరులో విరాట్ కోహ్లీ(135) సూపర్ సెంచరీకి కుల్దీప్ యాదవ్(4-68) మ్యాజిక్ తోడవ్వడంతో సఫారీలను చిత్తు చేసింది.
Ranchi ODI : టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ నుంచి తేరుకున్న భారత జట్టు వన్డే సిరీస్‌లో బోణీ కొట్టింది. రాంచీ మైదానంలో ఉత్కంఠగా సాగిన పోరులో విరాట్ కోహ్లీ(135) సూపర్ సెంచరీకి కుల్దీప్ యాదవ్(4-68) మ్యాజిక్ తోడవ్వడంతో సఫారీలను చిత్తు చేసింది. భారీ ఛేదనలో 130కే ఐదు వికెట్లు పడినా..మాథ్యూ బ్రిట్జ్(72), మార్కో జాన్సెస్(70), లు అర్థ శతకాలతో పోరాడి కంగారెత్తించారు. అయితే.. చైనామన్ కుల్దీప్ వీరిద్దరిని ఒకే ఓవర్లో వెనక్క పంపి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆఖర్లో కార్బిన్ బాస్చ్(67) మెరుపులు మెరిపించినా సరిపోలేదు. 17 పరుగులతో గెలుపొందిన రాహుల్ సేన మూడు వన్డేల సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
స్వదేశంలో టెస్టు సిరీస్ ఓటమికి దీటుగా బదులిచ్చింది భారత జట్టు. రాంచీలో అదివారం ఆధిపత్యం చేతులు మారిన తొలి వన్డేలో సూపర్ విక్టరీ సాధించింది. కేహెల్ రాహుల్ సారథ్యంలోని టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత బంతితో కుల్దీప్ యాదవ్ (4-68) తిప్పేయగా.. ప్రత్యర్థినికి ఆలౌట్ చేసి సిరీస్‌లో ముందంజ వేసింది. భారత్ నిర్ధేశించిన భారీ ఛేదనలో దక్షిణాఫ్రికా ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తన తొలి ఓవర్లోనే హర్షిత్ రానా (3-35) తొలి బంతికే ఓపెనర్ రియాన్ రికెల్టన్(0)ను బౌల్డ్ చేసిన రానా.. నాలుగో బంతికి క్వింటన్ డికాక్(0)ను డకౌట్‌గా వెనక్కి పంపాడు. అంతే.. 7 పరుగులకే సఫారీ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఒత్తిడికి లోనైన కెప్టెన్ ఎడెన్ మర్క్రమ్(7) సైతం అర్ష్‌దీప్ సింగ్ ఓవర్లో రాహుల్ చేతికి దొరికిపోయాడు. ఆ తర్వాత మాథ్యూ బ్రీట్జ్(54 నాటౌట్)తో టోనీ డి జోర్జి(39) కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. క్రీజులో కుదురుకున్నాక బౌండరీలతో స్కోర్ బోర్డును ఉరికించిన ఈ ద్వయాన్ని కుల్దీప్ విడదీశాడు.
Corbin Bosch kept India on edge till the end, but the hosts get the W in a Ranchi high-scorer
LIVE: https://t.co/OJm3attxYw | #INDvSA pic.twitter.com/joBiEP1oN9
— ESPNcricinfo (@ESPNcricinfo) November 30, 2025
నాలుగో వికెట్ తీసిన భారత బౌలర్ల సంబురాన్ని డెవాల్డ్ బ్రెవిస్(37) నీరుగార్చుతూ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. జడేజా ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన అతడు ఆ తర్వాత రానా ఓవర్లో పెద్ద షాట్ ఆడి గైక్వాడ్ చేతికి చిక్కాడు. అనంతరం బౌండరీలతో విరుచుకుపడుతున్న డెవాల్డ్ బ్రెవిస్(37) అతడి ఓవర్లో వెనుదిరిగాడు. సిక్సర్‌కు యత్నించిన బ్రెవిస్ బౌండరీ వద్ద రుతురాజ్ గైక్వాడ్ చేతికి దొరికిపోయాడు. 130కే సగం మంది పెవిలియన్ చేరినా.. మాథ్యూ బ్రీట్జ్(72), మార్కో జాన్సెన్(70) మాత్రం పట్టువిడువలేదు.
It’s Kuldeep Yadav again 🤷♂️
A nicely bowled wrong’un as he completes his spell with figures of 4/68 👏
KL Rahul with the catch 🙌
Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imkuldeep18 pic.twitter.com/wblYaYvruE
— BCCI (@BCCI) November 30, 2025
టెస్టు సిరీస్‌లో భారత్‌ను దెబ్బతీసిన జాన్సెన్ అలవోకగా ఫోర్లు, సిక్సర్లతో 26 బంతుల్లోనే యాభై కొట్టాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని 34వ ఓవర్లో కుల్దీప్ వెనక్కి పంపి మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పాడు. కార్బన్ బాస్చ్(67) ఆఖర్లో గట్టిగానే ప్రయత్నం చేశాడు. అర్ష్‌దీప్ వేసిన 49వ ఓవర్లో లో ఫుల్‌టాస్‌ను సిక్సర్‌గా మలిచాడు. దాంతో.. సమీకరణం 6 బంతుల్లో 18 పరుగులైంది. కానీ, ప్రసిధ్ వేసిన చివరి ఓవర్ రెండో బంతికి పెద్ద షాట్ ఆడిన బాస్చ్ మిడాన్‌లో రోహిత్ చేతికి చిక్కాడు. దాంతో.. 17 పరుగుల తేడాతో భారత్ జయభేరి మోగించింది.
India won the match, South Africa won the heart ❤
What a match & fight back 🫡#INDVSSAODI
— Veena Jain (@Vtxt21) November 30, 2025
కోహ్లీ శతక గర్జన..
టాస్ ఓడిన భారత జట్టు తొలుత భారీ స్కోర్ చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికేస్తూ విరాట్ కోహ్లీ(135) శతకంతో గర్జించగా.. రోహిత్ శర్మ(57) విధ్వసంక ఇన్నింగ్స్ ఆడాడు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 135 రన్స్ జోడించి మంచి పునాది వేశారు. హిట్‌మ్యాన్ ఔటయ్యాక గేర్ మార్చిన కోహ్లీ సిక్సర్లతో రెచ్చిపోయి 52వ సెంచరీ సాధించాడు. అతడు ఔటయ్యాక కెప్టెన్ కేఎల్ రాహుల్(60) డెత్ ఓవర్లలో ధనాధన్ ఆడి స్కోర్ 300 దాటించాడు. రవీంద్ర జడేజా(32) కూడా రాణించగా నిర్ణీత ఓవర్లలో టీమిండియా ప్రత్యర్థికి 350 పరుగుల పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించింది.
A leap of joy ❤️💯
A thoroughly entertaining innings from Virat Kohli 🍿
Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/llLByyGHe5
— BCCI (@BCCI) November 30, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

