Virat Kohli : ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ఆటకు దిగ్గజాలు ఫిదా అవుతున్నారు. అనామక బౌలర్లను అలవోకగా బాదేస్తున్న వైభవ్.. ప్రపంచ స్థాయి పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్, హేజిల్‌వుడ్‌లను సునాయసంగా ఎదుర్కోవడం చూసి ‘వారెవ్వా ఏమన్నా టాలెంటా’ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిచ్చరపిడుగు వీరకొట్టుడును ప్రత్యక్షంగా వీక్షించిన విరాట్ కోహ్లీ (Virat Kohli) సైతం ‘భలే ఆడావు చిన్నోడా’ అని కితాబిచ్చాడు. అంతేనా.. మ్యాచ్ అనంతరం వైభవ్‌కు ప్రేమగా ఆటోగ్రాఫ్ ఇచ్చి జోరు ఇలానే సాగనీ అని మనస్ఫూర్తిగా అభినందించాడు విరాట్.
అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రానికి ముందే సంచనాలు సృష్టిస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. పదిహేనేళ్ల ఈ కుర్రాడు సుడిగాలి ఇన్నింగ్స్‌లతో క్రికెట్‌ను ఎంతో ప్రేమించే భారతీయుల మనసులు చూరగొంటున్నాడు. ఒకప్పుడు సచిన్, కోహ్లీ కోసం స్టేడియాలకు తరలి వచ్చిన అభిమానులు ఇప్పుడు వైభవ్ ఆటను కళ్లారా చూసేందుకు పోటెత్తుతున్నారు. ఐపీఎల్లో పిడుగల్లే విరుచుకుపడుతున్న లెఫ్ట్ హ్యాండర్ ఆటను శుక్రవారం భారత లెజెండ్ విరాట్ కోహ్లీ స్వయంగా చూసి ఫిదా అయిపోయాడు.
Kohli celebrates every wicket with full passion but chose not to celebrate Vaibhav Sooryavanshi’s wicket. Respect ❤️ pic.twitter.com/80P8HBlEL3
— Suprvirat (@Mostlykohli) April 11, 2026
A job well done with a long road ahead! 💗 pic.twitter.com/tymVTrdeqK
— Rajasthan Royals (@rajasthanroyals) April 11, 2026
వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం అలవోకగా ఎదుర్కొంటున్న అతడి ధైర్యం, ప్రతిభను కొనియాడిన విరాట్ మ్యాచ్ అనంతరం ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. వెల్డన్ వైభవ్ అని వైభవ్ క్యాప్ మీద సంతకం చేశాడు కోహ్లీ. ఆర్సీబీపై 78 పరుగులతో రాణించిన ఈ కుర్ర పవర్ హిట్టర్ రాజస్థాన్ నాలుగో విజయంలో కీలకమయ్యాడు. పవర్ ప్లేలోనే అర్ధ శతకం బాదేసి బెంగళూరు నుంచి విజయాన్ని లాగేసుకున్నందుకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ఆరెంజ్ క్యాప్(300 పరుగులు)ను కూడా అందుకున్నాడీ డాషింగ్ బ్యాటర్. కొసమెరుపు ఏంటంటే.. ఈ మ్యాచ్‌లో వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్‌ను విరాట్ అద్భుత క్యాచ్‌తో ముగించాడు.
Player of the Match ✅
Orange Cap ✅
An autograph from Kohli 🐐✅Good night to everyone and remember to keep believing in yourself no matter what 💗 pic.twitter.com/Up2BZuYObM
— Rajasthan Royals (@rajasthanroyals) April 10, 2026