Virushka | కోహ్లీ దంపతుల ఆరో వివాహ వార్షికోత్సవ వేడుక.. సెలబ్రేషన్ ఫొటోలు వైరల్
Virushka : స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ(Virat Kohli), అనుష్కా శర్మ(Anushka Sharma) 6వ వివాహ వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. బంధు మిత్రలు, కుటుంబ సభ్యుల సమక్షంలో కోహ్లీ, అనుష్క కేక్ కట్ చేసి సంబురాలు...
Virushka : స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ(Virat Kohli), అనుష్కా శర్మ(Anushka Sharma) 6వ వివాహ వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. బంధు మిత్రలు, కుటుంబ సభ్యుల సమక్షంలో కోహ్లీ, అనుష్క కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. తమ వార్షికోత్సవం ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
‘రోజంతా ప్రేమ, స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిచిపోయింది. ఆరేండ్లు దాటినా నా జీవితంలోని ముఖ్యమైన వ్యక్తితో అంతులేని ప్రేమను పొందుతున్నా’ అని అనుష్క తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీమిండియా తరఫున పరుగుల వరద పారిస్తున్న సమయంలోనే కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్కతో ప్రేమలో పడ్డాడు. ఒక షాంపూ ప్రకటనలో కలిసి నటించిన వీరిద్దరూ కొన్నాళ్లు రహస్యంగా తమ ప్రేమాయాణాన్ని కొనసాగించారు. ఆ తర్వాత పలు మార్లు జంటగా మీడియా కంటపడిన కోహ్లీ, అనుష్క తమ రిలేషన్‌షిప్‌ను బహిర్గతం చేశారు. ఇరువురు కుటుంబ సభ్యులను ఒప్పించి ఇటలీలోని ప్యాలెస్‌లో 2017 డిసెంబర్ 11న అంగరంగ వైభవంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. విరుష్క(Virushka)గా పాపులర్ అయిన ఈ జంటకు 2021లో వామిక జన్మించింది.
కోహ్లీ, అనుష్కా శర్మ, వామిక

అండర్ -19 వరల్డ్ కప్ హీరోగా జాతీయ జట్టులోకి వచ్చిన విరాట్.. అనతికాలంలోనే తానెంటో నిరూపించుకున్నాడు. ఛేజ్ మాస్టర్‌గా వెలుగొందుతూనూ పలు రికార్డులు బద్ధలు కొట్టాడు. తన ఆరాధ్య ఆటగాడు సచిన్ నెలకొల్పిన అనితర సాధ్యమైన పలు మైలురాళ్లను కోహ్లీ అధిగమిస్తూ వస్తున్నాడు. ధోనీ వారసుడిగా జట్టు పగ్గాలు అందుకున్న కోహ్లీ దూకుడైన ఆటతో సహచరుల్లో స్ఫూర్తిని నింపాడు.
తాజాగా వన్డే వరల్డ్ కప్‌లో విరాట్ 50వ వన్డే శతకంతో సచిన్‌ను మించిపోయాడు. తాజాగా గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్ ఆయిన కోహ్లీ ఫిట్‌నెస్‌లోనూ రారాజే. అందుకనే అతడి కోసం యూజర్లు నెట్లో తెగ వెతికారట. ఈ జాబితాలో మరో భారత క్రికెటర్లు ఉన్నారు. సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ వివరాల కోసం సెర్చ్ చేశారు.
ఇవి కూడా చదవండి
- Rajasthan CM | నేడు రాజస్థాన్ సీఎంను ఎంపిక చేయనున్న బీజేపీ..
- Megha Lekha | బూట్‌కట్ బాలరాజు మూవీ టీజర్ లాంచ్‌లో మేఘ లేఖ..
- Raj Bhavan | ఆ వార్తలు అవాస్తవం.. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా ఆమోదంపై రాజ్‌భవన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

