SRH vs LSG | నితీశ్, క్లాసెన్ వైల్డ్‌ఫైర్ ఇన్నింగ్స్.. గెలుపు బాధ్యత బౌలర్లదే..!
SRH vs LSG : సొంత మైదానంలో దంచికొడతారనుకున్న టాపార్డర్ కుప్పకూలింది. రెండొందలకు పైగా స్కోర్‌తో ప్రత్యర్థిని భయపెట్టాలనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా తడబడింది. హెన్రిచ్ క్లాసెన్(62), నితీశ్ రెడ్డి(55)లు కీలక ఇన్నింగ్స్ ఆడారు.
SRH vs LSG : సొంత మైదానంలో దంచికొడతారనుకున్న టాపార్డర్ కుప్పకూలింది. రెండొందలకు పైగా స్కోర్‌తో ప్రత్యర్థిని భయపెట్టాలనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా తడబడింది. పవర్ ప్లేలో మహమ్మద్ షమీ(2-9) పడగొట్టాడు. 24కే నాలుగు వికెట్లు పడిన దశలో హెన్రిచ్ క్లాసెన్(62), నితీశ్ రెడ్డి(55)లు కీలక ఇన్నింగ్స్ ఆడారు. కాస్త కుదురుకున్నాక ఫోర్లు, సిక్సర్లతో లక్నో బౌలర్లను బెంబేలిచ్చిన ఈ ద్వయం ఐదో వికెట్‌కు విలువైన భాగస్వామ్యంలతో ఆరెంజ్ ఆర్మీని ఆదుకుంది. అయితే.. డెత్ ఓవర్లలో లక్నో బౌలర్లు వరుసగా వికెట్లు తీయడంతో సన్‌రైజర్స్ 156 పరుగులకే పరిమితమైంది.
టాస్ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఆరంభంలోనే మహమ్మద్ షమీ(2-9) దెబ్బకొట్టాడు. విధ్వంసక ఓపెనర్లు అభిషేక్ శర్మ(0)ను డకౌట్‌గా వెనక్కి పంపిన షమీ.. కాసేపటికే ట్రావిస్ హెడ్(7)ను వెనక్కి పంపాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే ఇషాన్ కిషన్(1)ను ప్రిన్స్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. వెంటట వెంటనే మూడు వికెట్లు పడిన వేళ లియాం లివింగ్‌స్టోన్(14) స్కూప్ షాట్‌కు ప్రయత్నించి రిషభ్ పంత్ చేతికి చిక్కాడు. 26 పరుగులకే నాలుగు కీలక వికెట్లు పడడంతో హెన్రిచ్ క్లాసెన్( నాటౌట్), నితీశ్ రెడ్డి(4 నాటౌట్)లు సన్‌రైజర్స్‌ను ఆదుకున్నారు. వికెట్ల పతనాన్ని అడ్డుకోవడంతో పది ఓవర్లకు స్కోర్.. 35-4.
గేర్ మార్చి.. స్కోర్‌బోర్డును ఉరికించి
ప్రిన్స్ ఓవర్లో చెరొక సిక్సర్లతో స్కోర్ 50 దాటించారు. ఆపై రథీ బౌలింగ్‌లో రెడ్డి వరుసగా రెండు ఫోర్లు బాదాడు. ఇక నా వంతు అన్నట్టు 14వ ఓవర్ అవేశ్ ఖాన్‌కు చుక్కలు చూపించిన క్లాసెన్ నాలుగు ఫోర్లతో రెచ్చిపోయాడు. వీరిద్దరి విధ్వంసంతో రన్‌రేటు ఆరుకు చేరింది.
1️⃣0️⃣0️⃣-run partnership! 🤩
Nitish Kumar Reddy and Heinrich Klaasen notch up their 5️⃣0️⃣s to drive @SunRisers into 5th gear 🏎️#SRH 134/4 in 17 overs
Updates ▶️ https://t.co/qC2rF1Hiiz#TATAIPL | #KhelBindaas | #SRHvLSG pic.twitter.com/uTpcDVHQFM
— IndianPremierLeague (@IPL) April 5, 2026
వైల్డ్‌ఫైర్ ఆటతో లక్నో బౌలర్లను వణికించిన నితీశ్, క్లాసెన్ ఒకరి వెంట ఒకరు వెనుదిరిగారు. హర్ష్ దూబే(0)ను బౌల్డ్ చేసి హ్యాట్రిక్‌పై నిలిచాడు. చివరి ఓవర్లో కుషాంగ్(4)ను ప్రిన్స్ బౌల్డ్ చేసినా.. హర్షల్ పటేల్(4) వస్తూనే ఫోర్ రాబట్టాడు. చివరి రెండు బంతులకు ఒకే రన్ రావడంతో సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 156 పరుగులకే పరిమితమైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

