Akash Deep | కోల్‌కతాకు వరుసగా షాకిస్తున్న పేసర్లు.. ఐపీఎల్‌కు దూరమైన ప్రధాన బౌలర్..!
Akash Deep : పంతొమ్మిదో సీజన్ ఐపీఎల్ ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆకాశ్ దీప్ (Akash Deep) సైతం గాయం కారణంగా మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు.
Akash Deep : పంతొమ్మిదో సీజన్ ఐపీఎల్ ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్లు ఒక్కొక్కరుగా గాయాల పాలవుతున్నారు. ఇప్పటికే హర్షిత్ రానా, మథీశ పథిరనలు టోర్నీకి దూరమవ్వగా.. ఆకాశ్ దీప్ (Akash Deep) సైతం గాయం కారణంగా మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు. దాంతో.. కోల్‌కతా పేస్ దళం దాదాపుగా ఖాళీ అయింది. ఇప్పటికే రానా, పథిరన స్థానంలో ఎవరిని తీసుకోవాలి? అని మల్లగుల్లాలు పడుతున్న ఫ్రాంచైజీకి ఇప్పుడు ఆకాశ్‌కు ప్రత్యామ్నాయం వెతకడం పెద్ద తలనొప్పిగా మారింది.
ఐపీఎల్ పండుగకు ముందే ఫ్రాంచైజీలను గాయాలు వెంటాడుతున్నాయి. ఫలితంగా పలు జట్లు ప్రధాన పేసర్లు సేవల్ని కోల్పోతున్నాయి. అన్నిటికంటే ఎక్కువగా కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీని ఆటగాళ్ల గాయాలు కలవరపరుస్తున్నాయి. గత మూడు సీజన్లలో పేస్ భారం మోస్తున్న హర్షిత్ రానా మోకాలి గాయంతో దూరమవ్వగా.. వేలంలో రూ.కోట్లు కొల్లగొట్టిన మథీశ పథిరన ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆకాశ్ దీప్ ఉన్నాడులే అనుకున్న యాజమాన్యానికి పెద్ద షాకే తగిలింది.
🚨 BIG BLOW FOR KKR 🚨 🟣🟡
– Akash Deep ruled out of the IPL 2026. pic.twitter.com/1dBtt7eVrF
— lndian Sports Netwrk (@IS_Netwrk29) March 21, 2026
రూ.కోటి పలికి
ఈమధ్య కాలంలో మైదానంలో కంటే రిహాబిలిటేషన్ సెంటర్లోనే ఎక్కువగా గడుపుతున్న ఆకా శ్ దీప్ ఐపీఎల్ ఆరంభానికి ముందే మరోసారి గాయపడ్డాడు. నిరుడు అబుధాబీలో జరిగిన మినీ వేలంలో రూ.1 కోటి పలికిన ఈ పేసర్ సైతం గాయంతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించాడు. ఈ విషయాన్ని ‘క్రిక్‌బజ్’తో కోల్‌కతా ఫ్రాంచైజీ అధికారి ఒకరు ధ్రువీకరించారు. ‘దురదృష్టవశాత్తూ ఐపీఎల్ నుంచి ఆకాశ్ దీప్ వైదొలిగాడు’ అని ఆయన చెప్పారు. దాంతో.. ఇప్పుడు కోల్‌కతా పేస్ దళంలో కొత్తగా వచ్చిన బ్లెస్సింగ్ ముజరబానీ (Blessing Muzrabani)పై బౌలింగ్ భారం పడనుంది. 19వ సీజన్ తొలి పోరులో మార్చి 29న ముంబై ఇండియన్స్‌తో కోల్‌కతా తలపడనుంది.
KKR are set to sign a replacement for Akash Deep.
Hopefully they go for a left handed middle order batsman.#IPL2026 https://t.co/HkboTeXUMC pic.twitter.com/mPFUrzej4g
— Swapnil Vats (@iamswapnilvats) March 21, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

