KKR vs SRH | టాస్ గెలిచిన కోల్‌కతా.. బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్
KKR vs SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్ల మధ్య ఐపీఎల్ టీ20 మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. మ్యాచ్ కోసం టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది.
KKR vs SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్ల మధ్య ఐపీఎల్ టీ20 మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ కోసం టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం. వేర్వేరు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడిన కేకేఆర్, ఎస్ఆర్హెచ్ జట్లు తమ మొదటి మ్యాచులో ఓడిపోయాయి.
దీంతో ఈ మ్యాచులోనైనా గెలిచి విజయాల ఖాతా తెరవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. సన్‌రైజర్స్ జట్టుకు బౌలింగ్ విభాగం ఇబ్బందిగా మారింది. ఐపీఎల్ టీముల్లో అత్యంత బలహీనమైన బౌలింగ్ కలిగిన జట్టుగా సన్‌రైజర్స్‌ను చెబుతున్నారు. బ్యాటింగ్ విభాగంలో బలంగానే ఉన్నప్పటికీ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ సరైన స్కోర్లు చేయలేకపోతున్నారు. కానీ, కెప్టెన్ ఇషాన్ కిషన్ మాత్రం బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. ఇక, కేకేఆర్‌కు సంబంధించి కెప్టెన్‌గా ఉన్న అజింక్యా రహానేకు ఇది 200వ ఐపీఎల్ మ్యాచ్. ఈ రెండు జట్లకు సంబంధించి టీం అంచనాలివి.
ఎస్ఆర్హెచ్
ఇషాన్ కిషన్(వికెట్ కీపర్/ కెప్టెన్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్,హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబె, శివంగ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, డేవిడ్ పేన్
కేకేఆర్
అజింక్యా రహానె(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, బ్లెస్సింగ్ ముజారబానీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- ipl
- Ishan Kishan
- KKR
- srh
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

