రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. నిలకడగా ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్ (34) పెవిలియన్ చేరాడు. బౌల్ట్ వేసిన 13వ ఓవర్ ఐదో బంతికి శ్రేయాస్ అవుటయ్యాడు. షార్ట్ బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించిన శ్రేయాస్ విఫలయ్యాడు. అయితే అతని గ్లవ్స్ తాకిన బంతి కీపర్ శాంసన్‌కు చేరింది.
అవుట్ కోసం అప్పీల్ చేస్తే.. అంపైర్ వైడ్‌గా ప్రకటించాడు. దీంతో మరో ఆలోచన లేకుండా శాంసన్ రివ్యూ కోరాడు. రివ్యూలో శ్రేయాస్ గ్లవ్స్‌కు బంతి తాకినట్లు స్పష్టంగా కనిపించడంతో అంపైర్ తన నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చింది. దీంతో కోల్‌కతా జట్టు 92 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.