IPL 2023 | కొత్త కెప్టెన్ వేటలో కోల్‌కతా నైట్ రైడర్స్.. రేసులో ఎవరెవరంటే..?
ఐపీఎల్ (IPL) పదహారో సీజన్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkat Knight Riders) ఫ్రాంఛైజీకి కొత్త చిక్కు వచ్చి పడింది. అన్ని జట్లు వ్యూహాలపై కసరత్తులు చేస్తుంటే ఆ జట్టు కొత్త కెప్టెన్ వేటలో పడింది. శ్రేయాస్ అయ్యర్ ప్లేస్‌లో మరొకరికి సారథ్య బాధ్యతలు అప్పగించాలని యాజమాన్యం భావిస్తోంది.
IPL 2023 : ఐపీఎల్ (IPL) పదహారో సీజన్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkat Knight Riders) ఫ్రాంఛైజీకి కొత్త చిక్కు వచ్చి పడింది. అన్ని జట్లు వ్యూహాలపై కసరత్తులు చేస్తుంటే ఆ జట్టు కొత్త కెప్టెన్ వేటలో పడింది. అవును.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. దాంతో, అతను ఈ సీజన్లో ఆడతాడా? లేదా? అనేది అనుమానంగా ఉంది. అందుకని అతడి ప్లేస్‌లో మరొకరికి సారథ్య బాధ్యతలు అప్పగించాలని యాజమాన్యం భావిస్తోంది. బోర్డర్ – గవాస్కర్ ఆఖరి టెస్టు నుంచి వెన్నునొప్పితో బాధపడుతున్న అయ్యర్ ఇంకా కోలుకోలేదు.
రేసులో వీళ్లే..
ఆల్‌రౌండర్ సునీల్ నరైన్(Sunil Narine), షకిబుల్ హసన్ కెప్టెన్సీ రేసులో అందరికంటే ముందున్నారు. నరైన్ ఈమధ్యే ఐఎల్టీ20లో అబూదాబీ నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ, ఘోరంగా విఫలమైన ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. షకిబుల్ సారథ్యంలోని బంగ్లా ఈమధ్యే విశ్వవిజేత ఇంగ్లండ్‌ను వన్డే సిరీస్‌లో వైట్‌వాష్ చేసింది. ఒకవేళ అతడికి కెప్టెన్సీ ఇస్తే కోల్‌కతా మిగతా విదేశీయుల్లో ముగ్గురిని రొటేషన్ పద్ధతిలో ఆడించాల్సి వస్తుంది. దేశవాళీలో ఢిల్లీని నడిపించిన నితీశ్ రానా కూడా రేసులో ఉన్నాడు.
గంభీర్ తప్పుకోవడంతో..
ఐపీఎల్లో విజయవంతమైన జట్లలో కోల్‌కతా ఒకటి. ఆ జట్టు ఇప్పటివరకు రెండుసార్లు (2012, 2014) చాంపియన్‌గా అవతరించింది. 2008లో లీగ్ ప్రారంభమైనా కోల్‌కతా దశ తిరిగింది మాత్రం 2012లోనే. గౌతం గంబీర్ కెప్టెన్సీలో ఆ జట్టు సంచలన విజయాలతో ఫైనల్ చేరింది. అంతేకాదు కప్పు కూడా కొట్టింది. అతను 2017లో ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో కోల్‌కతాకు కెప్టెన్సీ కష్టాలు మొదలయ్యాయి. 2021లో దినేశ్ కార్తిక్ విఫలం కావడంతో ఇయాన్ మోర్గాన్‌కు యాజమాన్యం సారథ్య బాధ్యతలు అప్పగించింది. గత సీజన్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోనూ ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరలేదు. ఈసారి అయ్యర్‌ను రూ.12.25 కోట్లకు వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రానా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలను రూ.8 కోట్లకు ఈ ఫ్రాంఛైజీ అట్టిపెట్టుకుంది. మార్చి 31న ఐపీఎల్ 2023 మొదలుకానుంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.
ఇవి కూడా చదవండి
Bangladesh | అంతర్జాతీయ క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా.. 10 వికెట్ల తేడాతో మొదటి విజయం
Sunil Gavaskar | ఐపీఎల్ సందడిలో పడి వన్డే సిరీస్ ఓటమిని మర్చిపోవద్దు.. టీమిండియాకు గవాస్కర్ హెచ్చరిక
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

