Spirit Of Cricket | మన్కడింగ్ చేసి.. వెనక్కి పిలిచి.. బంగ్లాదేశ్ క్రీడా స్ఫూర్తికి కివీస్ బ్యాటర్ ఫిదా
Spirit Of Cricket : క్రికెట్లో ఫార్మాట్ ఏదైనా అన్ని జట్లు గెలుపే లక్ష్యంగా ఆడతాయి. ఈ క్రమంలో కొన్నిజట్లు అప్పుడప్పుడూ స్లెడ్జింగ్(Sledging), బాల్ టాంపరింగ్(Ball Tampering) ఆయుధంగా ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తాయి. మన్కడింగ్ (Mankading) కూడా అచ్చం అలాంటిదే. అయితే.. కొందరు ఆటగాళ్లు మాత్రం క్రీడా స్ఫూర్తి(Spirit Of Cricket)ని ప్రదర్శించి..
Spirit Of Cricket : క్రికెట్లో ఫార్మాట్ ఏదైనా అన్ని జట్లు గెలుపే లక్ష్యంగా ఆడతాయి. ఈ క్రమంలో కొన్నిజట్లు అప్పుడప్పుడూ స్లెడ్జింగ్(Sledging), బాల్ టాంపరింగ్(Ball Tampering) ఆయుధంగా ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తాయి. మన్కడింగ్(Mankading) కూడా అచ్చం అలాంటిదే. అయితే.. కొందరు ఆటగాళ్లు మాత్రం క్రీడా స్ఫూర్తి(Spirit Of Cricket)ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంటారు. బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్(Litton Das) కూడా ఈరోజు అదే చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో లిట్టన్ క్రీడా స్ఫూర్తితో వార్తల్లో నిలిచాడు. అసలేం జరిగిందంటే..?
కివీస్ ఇన్నింగ్స్ 46వ ఓవర్లో బంగ్లా బౌలర్ హసన్ మహ్మద్(Hasan Mohmud) నాన్ స్ట్రయికర్ ఇష్ సోధీ(Ish Sodhi)ని మన్కడింగ్ చేశాడు. రనౌట్ కోసం అప్పీల్ చేశాడు. రివ్యూ చూశాక థర్డ్ అంపైర్ సోధీని రనౌట్‌గా ప్రకటించాడు. దాంతో, కొంత అసహనానికి గురైన న్యూజిలాండ్ ప్లేయర్ హసన్‌ను అభినందించి పెవిలియన్ బాట పట్టాడు.
Ish Sodhi was run out at the non strikers end by Hasan Mahmud.
The third umpire checked and gave OUT! But when Sodhi started walking out, skipper Litton Das and Hasan Mahmud called him back again.
Sodhi gave Hasan a hug at the end.
Scenes ❤️
— M (@anngrypakiistan) September 23, 2023
అయితే.. కెప్టెన్ లిట్టన్ దాస్(Litton Das), హసన్ కలిసి మన్కడింగ్ వెనక్కి తీసుకుంటున్నామని, సోధీని నాటౌట్‌గా పరిగణించాలని అంపైర్‌తో చెప్పారు. దాంతో, అంపైర్ వెంటనే సోధీని వెనక్కి పిలిచాడు. ఊహించని పరిణామంతో మొదట్లో షాక్ తిన్న సోధీ క్రీజులోకి వచ్చాక హసన్‌ను ప్రేమగా హత్తుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోష్ల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 254 పరుగులకు ఆలౌటయ్యింది.
ఇవి కూడా చదవండి
Asian Games 2023 | కన్నుల పండువగా ఆసియా గేమ్స్ ఆరంభ వేడుక.. భారత పతాక ధారులు వీళ్లే
MS Dhoni | లక్కంటే మనోడిదే.. విమానంలో ధోనీ పక్క సీటు పట్టేశాడు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

