ఫైనల్లో శ్రీకాంత్.. సయ్యద్ మోడీ టోర్నీ
సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత సీనియర్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్ సెమీఫైనల్లో శ్రీకాంత్ 21-15, 19-21, 21-13తో మిథున్ మంజునాథ్‌పై అద్భుత విజయం సాధించాడు. తొమ్మిదేండ్ల క్రితం 2016లో టైటిల్ విజేతగా నిలిచిన శ్రీకాంత్‌కు మంజునాథ్ దీటైన పోటీనిచ్చాడు.
- గాయత్రి, త్రిసా జోడీ తుది పోరుకు
లక్నో : సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత సీనియర్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్ సెమీఫైనల్లో శ్రీకాంత్ 21-15, 19-21, 21-13తో మిథున్ మంజునాథ్‌పై అద్భుత విజయం సాధించాడు. తొమ్మిదేండ్ల క్రితం 2016లో టైటిల్ విజేతగా నిలిచిన శ్రీకాంత్‌కు మంజునాథ్ దీటైన పోటీనిచ్చాడు. మూడు గేమ్‌ల పాటు హోరాహోరీగా సాగిన సెమీస్ పోరులో శ్రీకాంత్ తన అనుభవాన్ని ఉపయోగించి 2023 జాతీయ చాంపియన్ అయిన మంజునాథ్‌ను ఓడించాడు. తొలి గేమ్‌ను 21-15తో దక్కించుకున్న ఈ సీనియర్ షట్లర్‌కు రెండో గేమ్‌లో మంజునాథ్ నుంచి ప్రతిఘటన ఎదురైంది.
19-21తో రెండో గేమ్ గెలిచి పోటీలోకి వచ్చిన మంజునాథ్..చివరి గేమ్‌లో తడబడ్డాడు. ఇదే అదనుగా విజృంభించిన శ్రీకాంత్..21-13తో గేమ్‌తో సహా మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. మరోవైపు మహిళల డబుల్స్ సెమీస్‌లో భారత యువ జోడీ గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీ 21-11, 21-15తో ఆంగ్ జిన్ యి, కార్మెన్ తింగ్ ద్వయంపై అలవోక విజయం సాధించింది. భుజం గాయం కారణంగా ఐదు నెలల తర్వాత బరిలోకి దిగిన గాయత్రి..త్రిసాతో కలిసి స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించింది. మహిళల సింగిల్స్ సెమీస్‌లో ఉన్నతి హుడా 15-21, 10-21తో నెస్లిహన్ అరిన్(టర్కీ) చేతిలో ఓడగా, తన్విశర్మ 17-21, 16-21తో అకెచి(జపాన్)పై పరాజయం పాలైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

