హైదరాబాద్, ఆట ప్రతినిధి జనవరి 29: ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించనున్న ‘కేసీఆర్ మెగా కరాటే చాంపియన్‌షిప్ కప్’ బ్రోచర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం ఆవిష్కరించారు. లాల్‌బహుదూర్ స్టేడియంలో రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న కేసీఆర్ మెగా కరాటే చాంపియన్‌షిప్ కప్‌ను నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అనిల్ కుర్మాచలం, ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజీవ్ సాగర్, సాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, సామ్రాజ్యం, మాస్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.