SL Akshay : క్రికెట్టే ఊపిరిగా బతికిన ఓ ఆటగాడు అనూహ్యంగా మైదానంలోనే ప్రాణాలు విడిచాడు. ఫీల్డింగ్ చేస్తుండగా గుండెపోటు (Heart Attack) రావడంతో మరణించాడు. కర్నాటక రంజీ జట్టు మాజీ ఆటగాడు ఎస్ఎల్ అక్షయ్(39) ఆదివారం ఉన్నట్టుండి కుప్పకూలాడు. బెంగళూరులో స్థానిక డివిజన్ క్రికెట్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అక్షయ్‌కు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. అప్పటివరకూ తమతో హుషారుగా, సరదాగా క్రికెట్ ఆడిన అక్షయ్ ఇకలేడనే విషయాన్ని సహచరులు జీర్ణించుకోలేకపోతున్నారు.
మహారాజ ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20లో భాగంగా ఆదివారం అక్షయ్ మ్యాచ్ ఆడాడు. పేస్ బౌలరైన అతడు ఫీల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా ఛాతిలో నొప్పితో కూలబడిపోయాడు. చికిత్స కోసం అక్షయ్‌ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించాడని వైద్యులు చెప్పారు. దాంతో, అప్పటివరకూ తమతో గడిపిన అతడి మరణవార్త అందరినీ కలచివేసింది. అక్షయ్ చనిపోయాడనే విషయాన్ని భారత మాజీ ఆటగాడు దొడ్డ గణేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించాడు.
🚨 Sad News: Former Karnataka Fast Bowler SL Akshay Passes Away at 39 💔
It is with deep shock that we report the passing of SL Akshay, a former Karnataka state cricketer. He suffered a heart attack while playing a third-division match in Bengaluru today.
Key Highlights of His… pic.twitter.com/LWv539W519
— Indian Cricket News (@IndianCricNews) May 24, 2026
‘క్రికెట్ ప్రపంచానికి విషాదకరమైన వార్త. అండర్ -19 రోజుల నుంచి నేను చూస్తున్న పేస్ బౌలర్ ఎస్ఎల్ అక్షయ్(39) ఈరోజు డివిజన్ మ్యాచ్ ఆడుతుండగా గుండెపోటుతో మరణించాడు’ అని పేర్కొన్నాడు. అక్షయ్ అకాల మరణం పట్ల కర్నాటక క్రికెట్ సంఘం సంతాపం ప్రకటించింది.
Karnataka Cricketer SL Akshay Dies Of Heart Attack On Field – Why Even Fit Athletes Are At Risk?#heartrisk #cricketer #heartattackhttps://t.co/wq4WwGAgcA
— @zoomtv (@ZoomTV) May 25, 2026
‘ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కర్నాటకకు ఆడిన అక్షయ్ కెరీర్ ఆసాంతం ఆటపట్ల ఎంతో ఇష్టం, అంకితభావం కనబరిచాడు. జూనియర్ స్థాయిలో కోచ్‌గా సేవలందించిన ఆయన ప్రతిభావంతులను వెలికితీయడంలో కృషి చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా యువతలో క్రికెట్ నైపుణ్యాలు మెరుగపరచడంలో అక్షయ్ కీలక పాత్ర పోషించాడు’ అని కేఎస్‌సీఏ ఓ ప్రకటనలో తెలిపింది.