ఐపీఎల్ మళ్లీ షురూ: సెప్టెంబర్ 19న ముంబై, చెన్నై జట్ల మధ్య కీలక మ్యాచ్
IPL-2021: కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-14వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి పునఃప్రారంభం కానుంది. తొలిరోజైన సెప్టెంబర్ 19న డిఫెండింగ్ చాంపియన్స్

న్యూఢిల్లీ: కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-14వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి పునఃప్రారంభం కానుంది. తొలిరోజైన సెప్టెంబర్ 19న డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. నూతన షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 10న క్వాలిఫయర్ 1, అక్టోబర్ 11న ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. అక్టోబర్ 13న క్వాలిఫయర్ 2 మ్యాచ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 15న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
మేం సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్-14వ సీజన్‌ను పునరుద్ధరించనున్నాం. అక్టోబర్ 10, 13 తేదీల్లో క్వాలిఫయర్ 1, 2 మ్యాచ్‌లు నిర్వహిస్తాం. అక్టోబర్ 11న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. అన్ని మ్యాచ్‌లకు సంబంధించిన ఫుల్ షెడ్యూల్‌ను త్వరలో అన్ని టీమ్‌లకు తెలియజేస్తాం అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
గత వారం బీసీసీఐ కార్యదర్శి జై షా ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. భారత క్రికెట్ బోర్డు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను మరోసారి యూఏఈలో నిర్వహించబోతున్నదని ఆయన ప్రకటించారు. ఐపీఎల్‌కు సంబంధించి జైషా ఇప్పటికే యూఏఈ సాంస్కృతిక, యువజన, సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి షేక్ నహ్యాన్‌ను కలిసి మాట్లాడారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

