WTC Final: టీమ్ఇండియాతో ఆడే కివీస్ జట్టు ఇదే!

భారత్‌తో ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడే న్యూజిలాండ్ జట్టును మంగళవారం విడుదల చేశారు. 15 మందితో కూడిన జట్టును కివీస్ ప్రకటించింది. సౌతాంప్టన్‌లోని ఏజీస్ బౌల్ మైదానంలో జూన్ 18 నుంచి ఫైనల్ జరగనుంది. ఇటీవల ఇంగ్లాండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో రెండో టెస్టుకు ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమైన విషయం తెలిసిందే. గాయం నుంచి కోలుకున్న కేన్ మళ్లీ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
వికెట్ కీపర్ బీజే వాట్లింగ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. కోలిన్ డీ గ్రాండ్‌హోమ్‌ను స్పెషలిస్ట్ ఆల్‌రౌండర్‌గా చేర్చుకున్నారు. అజాజ్ పటేల్‌ను స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా తీసుకున్నారు.సౌతాంప్టన్ వేదికగా భారత క్రికెట్ జట్టుతో తలపడేందుకు మా ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని న్యూజిలాండ్ ప్రధాన కోచ్ గ్యారీ స్టీడ్ పేర్కొన్నాడు.
కివీస్ టీమ్:
కేన్ విలియమ్సన్(కెప్టెన్), టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, డేవాన్ కాన్వే, కోలిన్ గ్రాండ్‌హోమ్, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, టిమ్ సౌథీ, రాస్ టేలర్, నీల్ వాగ్నర్, బీజే వాట్లింగ్, విల్ యంగ్
The @BLACKCAPS have named a 15-member squad for the #WTC21 Final 👇 pic.twitter.com/g2T4XNCrMW
— ICC (@ICC) June 15, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

