Kane Williamson | విలియమ్సన్కు మళ్లీ టీ20 పగ్గాలు.. కేన్ మామకు తొలి సవాల్ ఆ సిరీసే..!
Kane Williamson : న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్(Kane Williamson) మళ్లీ టీ20 పగ్గాలు చేపట్టాడు. బంగ్లాదేశ్‌తో పొట్టి సిరీస్(T20 Series) కోసం సెలెక్టర్లు అతడిని సారథిగా ఎంపిక చేశారు. నిరుడు నవంబర్‌లో కివీస్ టీ20 కెప్టెన్‌గా వ్యవహరించిన విలియమ్సన్ ఏడాది తర్వాత మళ్లీ జట్టును...
Kane Williamson : న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్(Kane Williamson) మళ్లీ టీ20 పగ్గాలు చేపట్టాడు. బంగ్లాదేశ్‌తో పొట్టి సిరీస్(T20 Series) కోసం సెలెక్టర్లు అతడిని సారథిగా ఎంపిక చేశారు. నిరుడు నవంబర్‌లో కివీస్ టీ20 కెప్టెన్‌గా వ్యవహరించిన విలియమ్సన్ ఏడాది తర్వాత మళ్లీ జట్టును నడిపించనున్నాడు. పొట్టి సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ (Newzealand Cricket) ఆదివారం 15మందితో కూడిన బృందాన్ని ప్రకటించింది. డిసెంబర్ 27న బంగ్లాతో సిరీస్ మొదలవ్వనుంది.
న్యూజిలాండ్ స్క్వాడ్ : కేన్ విలియమ్సన్(కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, కైలీ జేమీసన్, అడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జేమ్స్ నీషం, గ్లెన్ ఫిలిఫ్స్, మిచెల్ శాంట్నర్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, టిమ్ సౌథీ, ఇష్ సోధీ.
ఈ ఏడాది ఆరంభంలో విలియమ్సన్ గాయపడ్డాడు. ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో గాయపడిన అతను స్వదేశంలో మోకాలి సర్జరీ చేయించుకున్నాడు. అనంతరం రిహాబిలిటేషన్‌లో ఉన్న అతడు దాదాపు 5 నెలలు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. వరల్డ్ కప్ ఆడతాడా? లేదా? అనే సందేహాల నడుమ విలియమ్సన్ గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చాడు. భారత గడ్డపై జరిగిన ప్రపంచకప్‌తో పునరాగమనం చేశాడు. మిడిలార్డర్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన కేన్ మామ 256 రన్స్ కొట్టాడు.
ఇవి కూడా చదవండి
- Parliament Security Breach | నిందితుడి దుస్తులు, షూస్, మొబైల్ ఫోన్ పరికరాలు రాజస్ధాన్‌లో ప్రత్యక్షం
- Demonte Colony 2 | క్రేజీ హారర్ థ్రిల్లర్.. కేక పుట్టిస్తున్న ‘డెమోంటే కాలనీ 2’ ట్రైలర్
- Kriti Sanon | అహా అనిపిస్తున్న కృతి సనన్ అందాలు..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

