Demonte Colony 2 | క్రేజీ హారర్ థ్రిల్లర్.. కేక పుట్టిస్తున్న ‘డెమోంటే కాలనీ 2’ ట్రైలర్
Demonte Colony 2 | కోలీవుడ్ నుంచే వచ్చే హారర్ చిత్రాలకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తమిళం నుంచి వచ్చిన చంద్రముఖి, పిజ్జా, పిజ్జా 2, 13బి, కాంచన, అరణ్మనై సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సాధించాయి. అయితే ఇదే జానర్లో తమిళంలో వచ్చిన మరో చిత్రం డెమోంటే కాలనీ.
Demonte Colony 2 | కోలీవుడ్ నుంచే వచ్చే హారర్ చిత్రాలకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తమిళం నుంచి వచ్చిన చంద్రముఖి, పిజ్జా, పిజ్జా 2, 13బి, కాంచన, అరణ్మనై సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సాధించాయి. అయితే ఇదే జానర్లో తమిళంలో వచ్చిన మరో చిత్రం ‘డెమోంటే కాలనీ'(Demonte Colony). నటుడు అరుల్ నిధి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రానికి ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. 2015లో చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా వచ్చిన 8 ఏండ్ల తర్వాత సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్.
‘డెమోంటే కాలనీ 2′(Demonte Colony 2) అంటూ ఈ సీక్వెల్ రానుండగా ఈ చిత్రంలో అరుల్ నీతి (Arulnithi) హీరోగా నటిస్తుండగా ప్రియా భవానీ శంకర్(Priya Bhavani Shankar) హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో అరుణ్‌పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవిందరాజన్, అర్చన రవిచంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలావుంటే.. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ఇక మొదటి పార్ట్ కథ ఒక బంగ్లాలో చిక్కుకున్న నలుగురు తాగుబోతు స్నేహితులు.. అక్కడ వారు అనుభవించే భయాందోళనలు మధ్య జరుగగా.. సెకండ్ పార్ట్ అక్కడ నుంచే మొదలవుతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఇక సెకండ్ పార్ట్ మరింత హారర్‌గా ఉండనున్నట్లు దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెలిపాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

