Rajasthan Royals : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ఆరంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) కొనుగోలు ప్రక్రియ ముగిసింది. మొదటి సీజన్ విజేతగా నిలిచిన రాజస్థాన్ ఫ్రాంచైజీకి వేలంలో భారీ ధర దక్కింది. ఇన్నాళ్లు ఫ్రాంచైజీ వాటాదారుల్లో ఒకరైన కల్ సమానీ (Kal Somani) రాజస్థాన్ జట్టును కొనేశాడు. రూ.1.5 లక్షల కోట్లకు అతడు ఆర్ఆర్ను హస్తగతం చేసుకున్నాడు. ఫ్రాంచైజీకి చెందిన వంద శాతం షేర్లు కొన్న సమానీ పంతొమ్మిదో సీజన్ నుంచి రాజస్థాన్ యజమాని హోదాలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నాడు.
ఐపీఎల్ ఆరంభ సీజన్ విజేతగా చరిత్ర సృష్టించిన రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం మారింది. ఊహించినట్టుగానే ఫ్రాంచైజీకి వేలంలో భారీ ధర దక్కింది. రాజస్థాన్ జట్టు వాటాదారుల్లో ఒకరైన కల్ సొమానీ 1.6 బిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో 15,301 కోట్లు) ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నాడు. చివరిదాకా పోటీపడిన టైమ్స్ గ్రూప్(Times Group) కంటే ఎక్కువ ధరతో సొమానీ టీమ్‌ను దక్కించుకున్నాడు.
🚨RAJASTHAN ROYALS SOLD IN MASSIVE DEAL!🚨
A US-based consortium led by entrepreneur Kal Somani has reportedly acquired 100% ownership of RR for around ₹15,000–15,300 crore. 🤯
This marks one of the biggest franchise deals in IPL history.(TOI) pic.twitter.com/VXHPSMtTq0
— Sam (@Cricsam01) March 24, 2026
అమెరికాలోని అరిజోనాకు చెందిన కల్ సోమానీకి గోల్ఫ్ అన్నా క్రికెట్ అన్నా చాలా ఇష్టం. మోటార్ సిటీ గోల్ఫ్ క్లబ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన సొమానీ రాజస్థాన్ రాయల్స్‌లో వాటా కొన్నాడు. 2026 ఎడిషన్ తర్వాత ఫ్రాంచైజీని అతడు కొనాలనుకున్నాడు. కానీ, వాటాదారులంతా ముందుగానే అమ్మకానికి పెట్టడంతో తానే దక్కించుకోవాలని సొమానీ భావించాడు.
🚨 RR Sold “Kal Somani-led consortium ” ₹$ 1.63 BILLION 🚨
• US-based entrepreneur Kal Somani has won the bid to own the Rajasthan Royals franchise
• New ownership will apply after IPL 2026
pic.twitter.com/mWLPHM1Om7— Indian Cricket Netwrk (@ICN_Updates01) March 24, 2026
ఫ్రాంచైజీలో అత్యధికంగా 65 శాతం వాటా కలిగిన మనోజ్ బడలే.. ఇతరుల షేర్లను కూడా కొనేసి ఐపీఎల్లో కొత్త యజమానిగా అవతరించాడు. 19వ సీజన్లో రియాన్ పరాగ్ (Riyan Parag) సారథ్యంలో రాజస్థాన్ రాయల్స్ బరిలోకి దిగుతోంది. మార్చి 30న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK)ను రాజస్థాన్ ఢీకొట్టనుంది.