Kabo Verde | చిన్ని దేశంలో రెట్టింపైన స్వాతంత్య్ర సంబురం.. వరల్డ్‌కప్ హీరోలకు జననీరాజనం..!
Kabo Verde : ఆఫ్రికా దేశమైన కాబో వెర్డే (Kabo Verde)లో స్వాతంత్ర దినోత్సవం సంబురాలు రెండింతలయ్యాయి. అట్లాంటిక్ మహా సముద్రంలోని ద్వీపాల్లో ఒకటైన ఈ దేశంలో ఆదివారం 51వ సాతంత్ర్య వేడుకలు అంబరాన్నంటాయి.
Kabo Verde : ఆఫ్రికా దేశమైన కాబో వెర్డే (Kabo Verde)లో స్వాతంత్ర దినోత్సవం సంబురాలు రెండింతలయ్యాయి. అట్లాంటిక్ మహా సముద్రంలోని ద్వీపాల్లో ఒకటైన ఈ దేశంలో ఆదివారం 51వ సాతంత్ర్య వేడుకలు అంబరాన్నంటాయి. దేశ చరిత్రలో చిరస్మరణీయమైన ఇదే రోజున ఫిఫా వరల్డ్కలో అదరగట్టిన ఫుట్‌బాల్ జట్టుకు జనం నీరాజనాలు పలికారు. విమానాశ్రయం సమీపంలో భారీగా పోగైన జనం వరల్డ్‌కప్ హీరోలకు అదిరిపోయే స్వాగతం పలికారు.
పోర్చుగీసు పాలనలో ఉన్న కాబో వెర్డేకు జూలై 5వ తేదీన స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటినుంచి ప్రతి ఏడాది జూలై 5న దేశ ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో తమ జట్టు అద్భుత ప్రదర్శన వారి సంబురాలను రెట్టింపు చేసింది. తొలిసారి ఫిఫా ప్రపంచకప్ ఆడిన కాబో వెర్డే సంచలన ఆటతో 32వ రౌండ్‌కు దూసుకెళ్లింది. నాకౌట్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు ముచ్చెమటలు పట్టించారు కాబో వెర్డే ఆటగాళ్లు. అదనపు సమయంలో గోల్‌తో 3-2తో లియోనల్ మెస్సీ సేన గెలిచినా.. యావత్ ఫుట్‌బాల్ అభిమానుల మనసులు గెలుచుకున్నారు.
‼️🇨🇻 LA SELECCIÓN DE CABO VERDE YA LLEGÓ A SU PAÍS pic.twitter.com/6efQBKa7Qh
— Avellaneda_Real (@avellaneda_real) July 5, 2026
తొలి గోల్ అతడిదే
చిన్నదేశంగా ఫిఫా వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టిన కాబో వెర్డే అబ్బురపరిచే ఆటతో ఆకట్టుకుంది. అమెరికా, కెడనా, మెక్సికో వేదికగా జరుగుతున్న మెగా టోర్నీలో కాబో వెర్డే తరఫున మొదటి గోల్ కొట్టిన ఆటగాడిగా కెవిన్ పినా (Kevin Pina) రికార్డు నెలకొల్పాడు. అర్జెంటీనాపై అదనపు సమయంలో గోల్ చేసిన సిడ్నీ లోపెస్ కాబ్రల్(Sidny Lopes Cabral) పేరు కూడా ఈసారి మార్మోగిపోయింది. 32వ రౌండ్లోనే వెనుదిరిగినా తమ దేశప్రజలంతా గర్వపడే ప్రదర్శనతో ఆ జట్టు ఆటగాళ్లు జూలై 5, స్వాతంత్ర్య దినోత్సవం రోజే స్వదేశంలో అడుగుపెట్టారు. ఇంకేముంది.. ఒకేరోజు రెండు పండుగలు అన్నట్టుగా జనం సంబురాల్లో మునిగిపోయారు.
Вауу! Қандай супер гол! Кабо-Верде! Бўлибам Аргентинага экстра таймда ҳисобни тенглаштирмоқда pic.twitter.com/tgvQvDgasQ
— Safo Musaev (@abbossugli) July 4, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

