Rajiv Mishra | హాకీ వరల్డ్ కప్ స్టార్ కన్నుమూత.. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు
Rajiv Mishra : భారత జూనియర్ హాకీ వరల్డ్ కప్(Junior Hockey Star) హీరో రాజీవ్ మిశ్రా(Rajiv Mishra) కన్నుమూశాడు. వారణాసిలోని తన సొంత ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాజీవ్ రెండు మూడు రోజుల క్రితమే మరణించి ఉంటాడని పోలీసులు అంటున్నారు. రాజీవ్ లండన్‌లో జరిగిన 1997 వరల్డ్ కప్(World Cup)లో....
Rajiv Mishra : భారత జూనియర్ హాకీ వరల్డ్ కప్(Junior Hockey Star) హీరో రాజీవ్ మిశ్రా(Rajiv Mishra) కన్నుమూశాడు. వారణాసిలోని తన సొంత ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాజీవ్ రెండు మూడు రోజుల క్రితమే మరణించి ఉంటాడని స్థానికులు అంటున్నారు. అతను నివసిస్తున్న ఇంటిలోంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో, పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు.
‘రాజీవ్ అకాల మరణం భారత హాకీకి తీరని లోటు. అతనొక అద్భుతమైన నైపుణ్యం ఉన్న ప్రతిభావంతుడు’ అని రాజీవ్ చిన్ననాటి కోచ్ ప్రేమ్ శంకర్ శుక్లా(Prem Shanker Shukla) అన్నాడు. రాజీవ్ మృతి పట్ల హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టర్కీ(Dilip Tirkey) సంతాపం తెలియజేశాడు. 46 ఏళ్ల రాజీవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రాజీవ్ మిశ్రా – 1997 జూనియర్ హాకీ జట్టు

జర్మనీపై డైవింగ్ గోల్
రాజీవ్ లండన్‌లో జరిగిన 1997 వరల్డ్ కప్(London World Cup)లో సత్తా చాటాడు. అయితే.. ఫైనల్లో భారత జట్టు 2-3తో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో జర్మనీపై కొట్టిన డైవింగ్ గోల్‌ను ఫ్యాన్స్ ఇప్పటికీ మర్చిపోలేరు. అతను 9 గోల్స్ కొట్టాడు. ఆ టోర్నీతో రాజీవ్‌కు అభిమానగణం పెరిగింది. ఆటలో రాణిస్తున్న రాజీవ్‌కు ఉత్తర రైల్వే(North Railway) లక్నో డివిజన్లోని వారనణాసి చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ టికెట్(Chief Inspector of Ticket)గా ఉద్యోగం వచ్చింది. దాంతో, అప్పటి నుంచి అతను అక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. రాజీవ్ సొంతూరు బిహార్‌లోని హజీపూర్(Hajipur). రాజీవ్ ప్రతిభను గుర్తించిన కోచ్ శంకర్ 13 ఏళ్ల వయసులో అతడిని వారణాసికి తీసుకొచ్చాడు. అక్కడ స్పోర్ట్స్ అథారిటీలో చేర్పించాడు. అక్కడ రాజీవ్ ఆటలో మరింత మెరుగుపడ్డాడు. జూనియర్ వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించాడు.
ఇవి కూడా చదవండి
Womens Ashes Series | రికార్డు సెంచరీలు బాదిన ఆసీస్, ఇంగ్లండ్ బ్యాటర్లు
ODI World Cup-23 | ప్రపంచ కప్‌లో రెండు వేదికలను మార్చాలన్న పాక్..! మంచి సాకు చెబితే బాగుండేదన్న స్పిన్నర్ అశ్విన్..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhogi Review | ‘భోగి’ సినిమా రివ్యూ.. శర్వానంద్ కొత్త సినిమా ఎలా ఉందంటే!
SONNENTAL | ‘డార్క్’ మేకర్స్ నుంచి మరో క్రేజీ థ్రిల్లర్.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘సోనెంటల్’ ట్రైలర్!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌కు FWICE గట్టి వార్నింగ్.. భారత్‌లో ఆ పాకిస్థానీ వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తే షూటింగ్స్ బంద్!
Hyderabad | కొండాపూర్‌లో అక్రమ సెల్లార్ నిర్మాణం.. కూలిన పక్క హోటల్ గోడ, పలువురికి గాయాలు!
Road Accident | ఇచ్చోడ జాతీయ రహదారిపై కారు బోల్తా.. నలుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

