ధర్మశాల: ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్ జో రూట్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 82 పరుగులు చేయడం ద్వారా వన్డే ప్రపంచకప్‌లలో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ రూట్ నిలిచాడు.
ముప్పై రెండేళ్ల జో రూట్ వన్డే ప్రపంచకప్‌లలో మొత్తం 18 మ్యాచ్‌లు ఆడి 917 పరుగులు సాధించడం ద్వారా ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో అగ్ర స్థానానికి చేరుకున్నాడు. గ్రహమ్ గూచ్ 897 పరుగుల రికార్డును రూట్ బద్దలు కొట్టాడు. ప్రపంచకప్‌లలో గూచ్ మొత్తం 21 మ్యాచ్‌లు ఆడి 897 పరుగులు చేశాడు.