DC vs RCB : ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) నాలుగో వికెట్ పడింది. జెమీమా రోడ్రిగ్స్ (32) ఔట్ అయింది. ఆశా శోభన ఓవర్లో కీపర్ రీచా క్యాచ్ పట్టడంతో ఆమె పెవిలియన్ చేరింది. మరిజానే కాప్ (16)తో కలిసి జెమీమా నాలుగో వికెట్‌కు 39 రన్స్ జోడించింది. జెస్ జొనాసెన్ క్రీజులోకి వచ్చింది. 15 ఓవర్లకు ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 114 రన్స్ చేసింది. ఆ జట్టు విజయానికి 30 బంతుల్లో 37 రన్స్ కావాలి.
కెప్టెన్ మేగ్ లానింగ్ (15) 70 పరుగుల ఔట్ అయింది. ఆశా శోభన ఓవర్లో లానింగ్ ఇచ్చిన క్యాచ్‌ను హీథర్ నైట్ అందుకుంది. ఉన్నంత సేపు అలిసే క్యాప్సే (38) విరుచుకుపడింది. ఫోర్లతో స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించింది. ఆమె రెండో వికెట్‌గా వెనుదిరిగింది. ఓపెనర్ షఫాలీ వర్మ (0) తొలి ఓవర్ రెండో బంతికే బౌల్డ్ అయింది. ఆర్సీబీ బౌలర్లలో ఆశా శోభన, ప్రీతీ బోస్ తలా ఒక వికెట్ పడగొట్టారు.