IND vs PAK | పాకిస్థాన్‌పై ఏడు వికెట్ల తేడాతో భారత్ విజయం
పొట్టి ప్రపంచకప్‌లో భారత్ బోణీ కొట్టింది. పాకిస్థాన్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ అర్థ సెంచరీ(53 నాటౌట్) తో గెలిపించింది.
IND vs PAK : దక్షిణాఫ్రికాలో జరగుతున్న పొట్టి ప్రపంచకప్‌లో భారత్ బోణీ కొట్టింది. పాకిస్థాన్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ అర్థ సెంచరీ(53 నాటౌట్) తో గెలిపించింది. ఫాతిమా సనా వేసిన 19వ ఓవర్లో జెమీమా రోడ్రిగ్స్ మూడు ఫోర్లు బాదింది. దాంతో, ఒక ఓవర్ మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. జెమీమా, రీచా ఘోష్ (31) నాలుగో వికెట్‌కు 58 రన్స్ జోడించారు. విరోచితంగా ఆడి జట్టును గెలిపించిన జెమీమ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది.
రన్‌రేట్ 10 పైనే
150 లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు షషాలీ వర్మ, యస్తిక భాటియా శుభారంంభం ఇచ్చారు. వీళ్లిద్దరూ తొలి వికెట్‌కు 31 రన్స్ జోడించారు. అయితే.. నశ్ర సంధు షఫాలీ (33), హర్మన్‌ప్రీత్ కౌర్ (16)లను ఔట్ చేసి ఇండియాను ఒత్తిడిలోకి నెట్టింది. అయితే.. జెమీమాతో జత కలిసిన రీచా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. సాధించాల్సిన రన్‌రేటు 10 పైనే ఉండడంతో వీళ్లు ధాటిగా ఆడారు. నశ్ర సంధు రెండు వికెట్లు, సాదిక్ ఇక్బాల్ ఒక వికెట్ తీశారు. 93 రన్స్ వద్ద హర్మన్‌ప్రీత్ కౌర్ ఔట్ అయింది. నష్ర సంధు బౌలింగ్‌లో షఫాలీ మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడింది. అందరూ సిక్సర్ అనుకున్నారు. కానీ, అమీన్ చాలా ఒడుపుగా క్యాచ్ పట్టింది.
68 రన్స్‌కే 4 వికెట్లు
తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 149 రన్స్ చేసింది. రాధిక యాదవ్ విజృంభించడంతో ఒక దశలో పాకిస్థాన్ 68 రన్స్‌కే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే.. కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ధాటిగా ఆడింది. 55 బంతుల్లో 7 ఫోర్లతో 68 రన్స్ చేసింది. మరూఫ్, అయేషా నసీం (43) తో కలిసి ఐదో వికెట్‌కు 81రన్స్ జోడించింది. వీళ్లిద్దరూ మరో వికెట్ పడకుండా ఆడి స్కోర్‌బోర్డు వంద దాటించారు. ఓపెనర్ జవేరియా ఖాన్ (8), మునీబ ఆలీ (12), నిడా దార్ (0) స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో రాధ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ, పూజా వస్త్రకార్ తలా ఒక వికెట్ తీశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

