Jasprit Bumrah | తండ్రైన బుమ్రా.. ఎక్స్‌లో ఫొటో షేర్ చేసిన క్రికెటర్
Jasprit Bumrah | టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తొలిసారిగా తండ్రయ్యాడు. బుమ్రా సతీమణి, యాంకర్ సంజనా గణేశన్ (Sanjana Ganeshan) సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని బుమ్రా సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. తన కుమారుడి ఫొటోని అభిమానులతో పంచుకుంటూ అంగద్ జస్ప్రీత్ బుమ్రా (Angad Jasprit Bumrah) అని పేరు పెట్టినట్లు ఎక్స్‌లో తెలిపాడు.
Jasprit Bumrah | టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తొలిసారిగా తండ్రయ్యాడు. బుమ్రా సతీమణి, యాంకర్ సంజనా గణేశన్ (Sanjana Ganeshan) సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని బుమ్రా సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. తన కుమారుడి ఫొటోని అభిమానులతో పంచుకుంటూ అంగద్ జస్ప్రీత్ బుమ్రా (Angad Jasprit Bumrah) అని పేరు పెట్టినట్లు ఎక్స్‌లో తెలిపాడు.
”మా చిన్న కుటుంబం పెరిగింది.. మా హృదయాలు మేము ఊహించిన దానికంటే ఎక్కువ సంతోషంగా ఉన్నాయి. ఈ ఉదయం మేము మా లిటిల్ బాయ్ అంగద్ జస్ప్రీత్ బుమ్రాను ప్రపంచంలోకి స్వాగతించాము. మేము ప్రస్తుతం చంద్రునిపై ఉన్నాము. మా జీవితంలోని ఈ కొత్త అధ్యాయం, దానితో పాటు తెచ్చే ప్రతిదాని కోసం వేచి చూస్తున్నాం.. జస్ప్రీత్ బుమ్రా- సంజన అంటూ బుమ్రా ట్విట్టర్లో రాసుకోచ్చాడు. దీంతో పలువురు నెటిజన్లు బుమ్రా-సంజన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అయింది.
Our little family has grown & our hearts are fuller than we could ever imagine! This morning we welcomed our little boy, Angad Jasprit Bumrah into the world. We are over the moon and can’t wait for everything this new chapter of our lives brings with it ❤️ – Jasprit and Sanjana pic.twitter.com/j3RFOSpB8Q
— Jasprit Bumrah (@Jaspritbumrah93) September 4, 2023
ఇదిలా ఉండగా.. ఆసియా కప్‌లో భాగంగా జరుగనున్న కీలకమైన నేపాల్(Nepal) మ్యాచ్‌కు జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) దూరం అయ్యాడు. తన భార్య ప్రసవం సమయంలో ఆమె వద్ద ఉండేందుకు బుమ్రా స్వదేశానికి తిరిగివచ్చారు.
ఇక టీమిండియా సూపర్ 4(Super-4)కు అర్హత సాధించాలంటే నేపాల్‌పై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అంత కీలకమైన పోరుకు బుమ్రా లేకపోవడం నిజంగా పెద్ద లోటు అని చెప్పాలి. అతడి స్థానంలో ఏ పేసర్‌ను తీసుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఐర్లాండ్ సిరీస్(Ireland Series)తో పునరాగమనం చేసిన బుమ్రా మళ్లీ ఫామ్ అందుకున్నాడు. రెండు టీ20ల్లో నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. దాంతో, బీసీసీఐ అతడిని ఆసియా కప్ పోటీలకు ఎంపిక చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

