బుమ్రా నం.1.. తొలి భారత పేసర్‌గా రికార్డు
భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కొత్త చరిత్ర లిఖించాడు. సుదీర్ఘ దేశ క్రికెట్లో ఇన్నాళ్లు ఎవరికీ సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు.
- టెస్టుల్లో టాప్ర్యాంక్లోకి
- తొలి భారత పేసర్‌గా రికార్డు
- ఇంగ్లండ్‌తో టెస్టుల్లో అదుర్స్
భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కొత్త చరిత్ర లిఖించాడు. సుదీర్ఘ దేశ క్రికెట్లో ఇన్నాళ్లు ఎవరికీ సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత పేసర్‌గా అరుదైన ఫీట్ అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో వికెట్లు వేట కొనసాగిస్తున్న బుమ్రా తాజా ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌లోకి దూసుకెళ్లాడు. వైవిధ్యమైన యాక్షన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు సింహస్వప్నంలా నిలుస్తున్న ఈ స్వింగ్కింగ్ రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తున్నది.
దుబాయ్: భారత పేస్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా..టెస్టుల్లో నంబర్‌వన్ ర్యాంక్‌ను అధిరోహించాడు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో బుమ్రా 881 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు. ఇంగ్లండ్‌తో విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో తొమ్మిది వికెట్లతో కదం తొక్కిన ఈ యువ పేసర్..ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. ఈ క్రమంలో కగిసో రబడ (851), అశ్విన్ (841), కమిన్స్(828)ను అధిగమిస్తూ కెరీర్లో తొలిసారి నంబర్‌వన్‌లో నిలిచాడు.
ఈ క్రమంలో అశ్విన్, జడేజా, బిషాన్సింగ్ బేడీ సరసన నిలిచాడు. అయితే గతంలో భారత్ నుంచి పేసర్లు కపిల్‌దేవ్(1979-1980) రెండో ర్యాంక్‌లో, జహీర్‌ఖాన్(2010) మూడో ర్యాంక్‌లో నిలువడమే ఇప్పటి వరకు అత్యుత్తమం కాగా బుమ్రా కొత్త రికార్డు నెలకొల్పాడు. వైజాగ్ టెస్టులో తనదైన స్వింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటింగ్‌ను కకావికలు చేయడంలో బుమ్రా కీలకంగా వ్యవహరించాడు. రివర్స్ స్వింగ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
యశస్వి @ 29
బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే..ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో డబుల్ సెంచరీతో విజృంభించిన యశస్వి జైస్వాల్ ఏకంగా 37 ర్యాంక్‌లు మెరుగుపర్చుకుని 29వ ర్యాంక్‌లో నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్ 14 ర్యాంక్‌ల మెరుగుతో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్ నుంచి టాప్-10లో విరాట్ కోహ్లీ (7) ఒక్కడే కొనసాగుతున్నాడు. రిషబ్ పంత్, రోహిత్‌శర్మ వరుసగా 12, 13 ర్యాంక్‌ల్లో ఉండగా, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా, అశ్విన్ తొలి రెండు ర్యాంక్‌ల్లో ఉన్నారు.
4 ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్న నాలుగో భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. గతంలో బిషాన్సింగ్ బేడీ, అశ్విన్, జడేజా ఈ ఫీట్ అందుకున్నారు.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

