Ravindra Jadeja | రాక్‌స్టార్ రవీంద్ర జడేజా.. మైదానంలో జడ్డూ స్టైలిష్ లుక్స్ చూశారా..?
Ravindra Jadeja : భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja).. ఆటతీరులోనే కాదు ఆహార్యంలోనే తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు. వెస్టిండీస్(Westindies)తో జరుగుతున్న తొలి టెస్టులో ఓవైపు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) వికెట్ల వేట కొనసాగిస్తుంటే.. మరో ఎండ్‌లో జడేజా తన జాదూ చూపించాడు. బౌలింగ్ సమయంలో జడేజా తన స్టైలిష్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో ఆన్లైన్లో...
Ravindra Jadeja : భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja).. ఆటతీరులోనే కాదు ఆహార్యంలోనే తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు. వెస్టిండీస్(Westindies)తో జరుగుతున్న తొలి టెస్టులో ఓవైపు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) వికెట్ల వేట కొనసాగిస్తుంటే.. మరో ఎండ్‌లో జడేజా తన జాదూ చూపించాడు. అశ్విన్ విండీస్ టాపార్డర్‌ను కుప్పకూలిస్తే.. మిడిలార్డర్‌ను జడేజా దెబ్బకొట్టాడు. బౌలింగ్ సమయంలో జడేజా తన స్టైలిష్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
సహచరులందరూ రాక్‌స్టార్ అని ముద్దుగా పిలుచుకునే జడేజా తన జుట్టు సరిగ్గా లేకపోవడం గమనించాడు. వెంటనే తన గాగుల్స్ తీసి దాన్ని ఒక అద్దంలా వాడుకుంటూ జుట్టును సరిచేసుకుని బౌలింగ్‌కు దిగాడు. జడ్డూ జుట్టు సరిచేసుకోవడం కెమెరాల్లో రికార్డయ్యింది. ‘బాయ్స్ ఇంతే’ అని అర్థం వచ్చేలా ఉన్న ఈ వీడియో సోషల్‌మీడియాలో కొన్ని గంటల వ్యవధిలోనే వైరల్‌గా మారింది.
జడేజా తన స్పిన్ మాయాజాలానికి తోడు మిడిలార్డర్లో బ్యాటర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్(IPL 2023)లోనూ చెన్నై సూపర్‌కింగ్స్(Chennai Super Kings)ను విజేతగా నిలుపడంలో జడ్డూదే ముఖ్య భూమిక.
ఐపీఎల్ ఫైనల్లో చెన్నైని గెలిపించిన జడేజా

మోహిత్ శర్మ(Mohit Sharma) వేసిన ఆఖరి ఓవర్లో చివరి రెండు బంతుల్ని సిక్స్, ఫోర్‌గా మలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. దీంతో ముంబై ఇండియన్స్‌తో సమంగా చెన్నై ఐదో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.
ఇవి కూడా చదవండి
Team India – South Africa Tour | భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన ఖరారు.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే..?
ICC | బీసీసీఐపై కాసుల వర్షం.. ఐసీసీ నుంచి ఏటా వేల కోట్ల ఆదాయం సమకూరనుంది
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

