DC vs PBKS : ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన పంజాబ్ కింగ్స్(Punjab Kings) ధర్మశాలలో భారీ స్కోర్ కొట్టింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(56) విధ్వసంక ఆటతో రెచ్చిపోగా.. పవర్ ప్లేలో ఢిల్లీ బౌలర్లు నీరుగారిపోయారు. కూపర్ కొన్నొల్లీ(38) అండగా మిడిల్ ఓవర్లో శ్రేయాస్ అయ్యర్(59 నాటౌట్) దంచేశాడు. ఆఖర్లో మిచెల్ స్టార్క్(2-57) రెండు వికెట్లు తీసినా సూర్యాన్ష్ షెడ్గే(21 నాటౌట్) మెరుపులతో పంజాబ్ స్కోర్ రెండొందలు దాటింది. కానీ, చివరి ఓవర్లో ఎంగిడి ఏడు పరుగులే ఇవ్వగా పంజాబ్ 210కి పరిమితమైంది.
హ్యాట్రిక్ ఓటముల నుంచి గెలుపు తోవ తొక్కాలనే కసితో పంజాబ్ ఓపెనర్లు ఆడారు. తొలి ఓవర్ నుంచే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడిన ప్రియాన్ష్ ఆర్య(56) ఎడాపెడా దంచేశాడు. అతడి ధాటికి పవర్ ప్లేలోనే స్కోర్ 70 దాటింది. ధాటిగా ఆడిన ప్రియాన్ష్ నబీ ఓవర్లో సింగిల్‌తో ఐదో ఆఫ్ సెంచరీ సాధించాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్(18)ను ముకేశ్ ఔట్ చేయడంతో తొలి వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే ప్రియన్ష్ను ఔట్ చేసిన మధ్వా తివారీ(2-40) రెండో వికెట్ అందించాడు.
Fast, Faster, @PunjabKingsIPL ❤️
Updates ▶️ https://t.co/wHhflKIvCR#TATAIPL | #KhelBindaas | #PBKSvDC pic.twitter.com/yHQYvepCzv
— IndianPremierLeague (@IPL) May 11, 2026
ఓపెనర్లు వెనుదిరిగినా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(59 నాటౌట్), కూపర్ కొన్నొల్లీ(38)లు దూకుడు కొనసాగించారు. వీరిద్దరి విధ్వంసంతో 16 ఓవర్లకే స్కోర్ 160 దాటింది. మధ్వా ఓవర్లో సిక్సర్‌తో అయ్యర్ అర్ధ శతకం సాధించాడు. కానీ, అదే ఓవర్లో రెండోసారి బంతిని స్టాండ్స్‌లోకి పంపబోయిన కొన్నొల్లీ నేరుగా మిల్లర్ చేతికి చిక్కాడు. తర్వాతి ఓవర్లో స్టార్క్ వరస బంతుల్లో స్టోయినిస్(1), శశాంక్ సింగ్(0)లను ఔట్ చేసి హ్యాట్రిక్‌పై నిలిచాడు. అయితే.. సూర్యాన్ష్ షెడ్గే(21 నాటౌట్) సిక్సర్‌తో హ్యాట్రిక్‌ను అడ్డుకున్నాడు. ఎంగిడి చివరి ఓవర్లో 7 పరుగులే ఇవ్వడంతో 220 ప్లస్ కొట్టాలనుకున్న పంజాబ్ 210తోనే సరిపెట్టుకుంది.