Ishan Kishan | దేవుడు కరుణిస్తాడని..! ఆలయాల బాట పట్టిన ఇషాన్ కిషన్
Ishan Kishan | తన వ్యవహార శైలి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందు విడుదలైన బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులలో చోటు కోల్పోయిన తిరిగి జాతీయ జట్టులో వచ్చేందుకు ఆలయాల బాట పట్టాడు.
Ishan Kishan | బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేస్తూ జాతీయ జట్టులో చోటు కోల్పోవడంతో పాటు బోర్డు కాంట్రాక్టును సైతం దూరం చేసుకున్న యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ తాజాగా ఆలయాల బాట పట్టాడు. నేడు 26వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ జార్ఖండ్ కుర్రాడు.. గురువారం మహారాష్ట్రలోని ప్రముఖ ఆలయం షిరిడీ సాయి మందిరాన్ని దర్శించుకున్నాడు. షిరిడీ ఆలయాన్ని దర్శించుకున్న ఇషాన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో మందిరంలో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ‘శ్రద్ద ఔర్ సబూరీ’ అని రాసుకొచ్చాడు.
గతేడాది భారత జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆడిన ఇషాన్ ఆ వెంటనే డిసెంబర్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాడు. కానీ ఆ పర్యటన నుంచి ‘వ్యక్తిగత కారణాలతో’ స్వదేశానికి వచ్చి కొన్నిరోజులు విశ్రాంతి తీసుకున్నాడు. అయితే జనవరిలో భారత జట్టు ఇంగ్లండ్‌తో ఆడిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు సెలక్టర్లు ఇషాన్ పేరును పరిగణనలోకి తీసుకోవాలంటే దేశవాళీలు ఆడాలని కోరారు. కానీ దీనికి ఇషాన్ నుంచి ఎటువంటి స్పందనా రాకపోవడంతో సెలక్టర్లు ధ్రువ్ జురెల్‌ను తుదిజట్టులోకి తీసుకున్నారు.
బీసీసీఐ అనుమతి లేకుండా కౌన్ బనేగా కరోడ్‌పతి షోకు వెళ్లడం, దేశవాళీలు ఆడకపోవడంతో బోర్డు ఆగ్రహానికి గురికాక తప్పలేదు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందు విడుదలైన బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి అతడికి ఉద్వాసన ఎదురైంది. కొద్దిరోజుల విరామం తర్వాత ఐపీఎల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఇషాన్.. పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన అతడు.. 22.86 సగటుతో 320 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా అతడికి చోటు దక్కలేదు. ప్రస్తుతం జాతీయ జట్టుకు దూరమై దేశవాళీలు ఆడలేక ఖాళీగా ఉంటున్న ఇషాన్ ఆలయాల బాట పట్టడం గమనార్హం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

