దుబాయ్: ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో భారత వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. సుమారు ఏడాదిపాటు ఈ స్థానంలో ఉన్న డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మను వెనక్కినెట్టి ఇషాన్ ఫస్ట్‌ప్లేస్‌కు దూసుకొచ్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వదేశంలోనే జరిగిన టీ20 ప్రపంచకప్‌లో 317 రన్స్ చేసిన ఇషాన్.. 876 రేటింగ్ పాయింట్లతో మొదటి ర్యాంకును కైవసం చేసుకోగా అభిషేక్ (869) రెండో స్థానానికి పడిపోయాడు.