బెల్ఫాస్ట్: అఫ్గానిస్థాన్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఐర్లాండ్ 3-2తో చేజిక్కించుకుంది. వరుణుడి అంతరాయం మధ్య బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పోరులో ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) గెలిచింది.
వర్షం కారణంగా మ్యాచ్ను 15 ఓవర్లకు కుదించగా.. నిర్ణీత ఓవర్లలో అఫ్గాన్ 5 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. ఉస్మాన్ గని (44) టాప్ స్కోరర్. ఐర్లాండ్ బౌలర్లలో అడైర్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం మ్యాచ్కు మరోమారు వర్షం అంతరాయం కలిగించడంతో ఐర్లాండ్ లక్ష్యాన్ని 7 ఓవర్లలో 56 పరుగులుగా నిర్ణయించగా.. ఆ జట్టు 6.4 ఓవర్లలో 56 రన్స్ చేసింది.