వారెవ్వా ఐర్లాండ్.. టీమిండియాకు దిమ్మతిరిగే షాక్
జూన్ 28, 2026.. ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా పసికూనగానే చలామణి అవుతున్న ఆ జట్టు అద్భుతమే చేసింది. వరుసగా రెండు టీ20 ప్రపంచకప్ ఎడిషన్లలో మేటి జట్లను కంగుతినిపించిట్రోఫీలు గెలిచిన భారత జట్టుకు దిమ్మతిరిగే షాకిస్తూ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
- టీ20 సిరీస్ కైవసం
- 16 సిరీస్‌ల జైత్రయాత్రకు బ్రేక్
బెల్ఫాస్ట్ : జూన్ 28, 2026.. ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా పసికూనగానే చలామణి అవుతున్న ఆ జట్టు అద్భుతమే చేసింది. వరుసగా రెండు టీ20 ప్రపంచకప్ ఎడిషన్లలో మేటి జట్లను కంగుతినిపించిట్రోఫీలు గెలిచిన భారత జట్టుకు దిమ్మతిరిగే షాకిస్తూ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం ఇక్కడ చివరి బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరులో ఐరిష్ జట్టు.. ఒక్క పరుగు తేడాతో టీమిండియాను చిత్తుచేసి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ప్రత్యర్థి నిర్దేశించిన 154 పరుగుల ఛేదనలో మరోసారి బ్యాటింగ్ వైఫల్యంతో చేతులెత్తేసిన భారత్.. 153/9 వద్దే ఆగిపోయి ఓటమిని మూటగట్టుకుంది. తిలక్ వర్మ (46 బంతుల్లో 55, 3 ఫోర్లు, 1 సిక్స్), హర్షిత్ రాణా (10 బంతుల్లో 21, 2 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగిలినవారంతా మళ్లీ చేతులెత్తేశారు. గత మ్యాచ్‌లో భారత్‌ను దెబ్బకొట్టిన భారత సంతతి బౌలర్ జై మూండ్రా, మాథ్యూ హాలార్డ్ తలా మూడు వికెట్లతో మరోసారి ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. జైకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులు లభించాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. హ్యారీ టెక్టర్ (53), బెంజిమిన్ (37) రాణించడంతో 154/8 చేసింది. ప్రిన్స్ యాదవ్ (3/22) మెరిశాడు.

తిలక్, రాణా పోరాడినా..
లక్ష్యం చిన్నదే అయినా ఛేదన తేలికేం కాదని భారత్‌కు తొలి ఓవర్లోనే తెలిసొచ్చింది. కొత్త బంతితో జై మరోసారి నిప్పులు చెరిగాడు. మొదటి బంతికే సంజూ శాంసన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అతడు.. నాలుగో బాల్‌కు అభిషేక్‌నూ పెవిలియన్‌కు పంపాడు. తన మరుసటి ఓవర్లో శ్రేయస్‌ను అద్భుతమైన బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. తిలక్‌తో సమన్వయ లోపంతో ఇషాన్ (12) రనౌట్ అయ్యాడు. వర్షం అంతరాయం తర్వాత తిరిగి ఆరంభమైన మ్యాచ్‌లో అక్షర్ (14), దూబే (20), విఫలమయ్యారు. ఫిఫ్టీ తర్వాత తిలక్ కూడా ఔట్ అవగా రాణా మెరుపులతో భారత్ విజయానికి చేరువైనా ఐదో బంతికి అతడు నిష్క్రమించడం పర్యాటక జట్టును దెబ్బతీసింది. ఈ ఓటమితో 16 ద్వైపాక్షిక సిరీస్ విజయాల భారత జైత్రయాత్రకు అడ్డుకట్ట పడింది. 2023 ఆగస్టు తర్వాత భారత జట్టు టీ20ల్లో సిరీస్ కోల్పోవడం ఇదే ప్రథమం. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన సారథిగా నిలిచి భారత జట్టు పగ్గాలను అందుకున్న శ్రేయస్.. సిరీస్ ఓటమితో తన కెప్టెన్సీ కెరీర్‌ను ఆరంభించడం గమనార్హం.
సంక్షిప్త స్కోర్లు
ఐర్లాండ్: 20 ఓవర్లకు 154/8 (టెక్టర్ 53, కలిట్జ్ 37, ప్రిన్స్ 3/22, దూబె 2/25);
భారత్: 20 ఓవర్లకు 153/9 (తిలక్ 55, రాణా 21, హాలార్డ్ 3/26, జై 3/32)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

