గాలె : టెస్టుల్లో ఐర్లాండ్ తమ అత్యధిక స్కోరును రికార్డు చేసింది. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఐర్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 492 పరుగులు చేసింది. టెస్టుల్లో ఐర్లాండ్‌కిదే అత్యధిక స్కోరు. గతంలో పాకిస్థాన్‌పై 1998లో డబ్లిన్‌లో చేసిన 339 పరుగుల స్కోరును ఇప్పుడు అధిగమించింది.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి లంక తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 81 పరుగులు చేసింది. రెండో రోజు ఐర్లాండ్ ఆటగాళ్లు స్టిర్లింగ్(103), కర్టిస్ కాంపర్(111) టెస్టుల్లో తమ తొలి సెంచరీలు నమోదు చేసుకున్నారు. ప్రభాత్ జయసూరియ 5, విశ్వ ఫెర్నాండొ, అసిత ఫెర్నాండొ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.