వరల్డ్‌కప్ హీరో: వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్‌రౌండర్

ఐర్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ కెవిన్ ఒబ్రెయిన్(37) వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఫార్మాట్లో కొనసాగాలనే ఆసక్తి, ప్రేమ తనకు లేదని పేర్కొన్నాడు. టెస్టు, టీ20 క్రికెట్‌కు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నాడు. ఐర్లాండ్‌కు 15ఏండ్ల పాటు ప్రాతినిధ్యం వహించాను. వన్డే క్రికెట్ నుంచి వైదొలగడానికి, రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను అని ఒబ్రెయిన్ వివరించాడు.
2006లో అరంగేట్రం చేసిన కెవిన్ 153 వన్డేల్లో 3,618 పరుగులు చేయగా, మీడియం పేస్‌తో 114 వికెట్లు పడగొట్టాడు. ఆ దేశం తరఫున అత్యధిక వికెట్ల రికార్డు తనపేరిట ఉన్నది. భారత్ ఆతిథ్యమిచ్చిన 2011 వన్డే ప్రపంచకప్ ద్వారా కెవిన్ ఒక్కసారిగా స్టార్ బ్యాట్స్‌మన్‌గా మారిపోయాడు. తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా బెంగళూరు వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒబ్రెయిన్ రికార్డు శతకం బాదేశాడు. కేవలం 50 బంతుల్లోనే 100 పరుగుల మార్క్ చేరుకున్నాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 327 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఒబ్రెయిన్(113 రన్స్) మెరుపు సెంచరీ సాధించడంతో ఐర్లాండ్ అలవోకగా విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో ఇదే అత్యంత వేగవంతమైన శతకంగా నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

