FIFA World Cup : ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇరాన్ (Iran) నాకౌట్ బెర్తు కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టోర్నీలో అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నా గొప్పగా ఆడిన ఆ జట్టు ఈజిప్ట్(Egypt)తో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకోవమే అందుకు కారణం. చివరి నిమిషంలో ఇరాన్ ఆటగాడు ఖలిజదేహ్ గోల్ చేసినా వీడియో అసిస్టెంట్ రిఫరీ మాత్రం లెక్కలోకి తీసుకోకపోవడం ఈజిప్ట్ 32వ రౌండ్‌కు దూసుకెళ్లింది. దాంతో.. ఇరాన్ ఆటగాళ్లు నిరాశలో మునిగిపోయారు.
గ్రూప్ జీలోని ఇరాన్, ఈజిప్ట్ నాకౌట్ బెర్తు లక్ష్యంగా హోరాహోరీగా తలపడ్డాయి. ఐదో నిమిషంలోనే మహమూద్ సబెర్()గోల్ అందించగా.. ఈజిప్ట్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాసేపటికి ఇరాన్‌కు పెనాల్టీ లభించినా సద్వినియోగం చేసుకోలేదు. ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదిస్తూ 14వ నిమిషంలో రమిన్ రజీయన్ గోల్‌తో ఇరాన్ 1-1తో స్కోర్ సమం చేసింది. ఆ తర్వాత ఇరజట్ల ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నించారు.
🇮🇷 Iran nailed an incredible goal in injury time during their World Cup match with Egypt, putting them 2-1 ahead in the final moments of the game
The crowd went wild, but the VAR ruled one of their players offside
Gutting for the fans, it’s the third game that Iran’s had goals…
— Mario Nawfal (@MarioNawfal) June 27, 2026
ఇక మ్యాచ్ డ్రా ఖాయమనుకున్న వేళ.. 93వ నిమిషంలో నిమిషంలో ఆట ముగుస్తుందనగా.. ఇరాన్ ప్లేయర్ ఖలిజదేహ్ ఈజిప్ట్ గోల్‌పోస్ట్‌లోకి బంతిని పంపాడు. 2-1తో ఆసియా జట్టు గెలిచిందనుకుంటే.. బంతి ఆఫ్ సైడ్ వెళ్లిందని వీడియో అసిస్టెంట్ రిఫరీ గోల్ ఇవ్వలేదు. దాంతో, 1-1తో మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఈజిప్ట్ నాకౌట్లో అడుగుపెట్టింది. గ్రూప్ జీ నుంచి బెల్జియం, ఈజిప్ట్ 32వ రౌండ్‌కు చేరగా.. మూడో స్థానంతో ఇరాన్ నాకౌట్ చేరే అవకాశముంది.