Iran : ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్(Iran) జట్టు ఫిఫా యాజమాన్యానికి ఫిర్యాదు చేయనుంది. అమెరికా అధికారుల తీరుతో విసిగిపోయిన ఇరాన్ బృందం రవాణా ఆంక్షలను ఫిఫా దృష్టికి తీసుకెళ్లనుంది. మ్యాచ్ అనంతరం అమెరికాను వీడాలని హెచ్చరికలు తమ సన్నద్ధతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆక్రోశం వెల్లగక్కిన ఇరాన్.. టోర్నీ నిర్వాహకులకు కంప్లైట్ చేయాలని భావిస్తున్నాయి.
ప్రతిష్ఠాత్మక ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇరాన్‌కు మైదానం అవతల కఠిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వీసా కష్టాలతో పాటు అమెరికాలో ఉండొద్దనే ఆంక్షలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ సమస్యలను ఫిఫా యాజమాన్యానికి ఇరాన్ బృందం మొరపెట్టుకుంటోంది. తమపై రవాణా ఆంక్షల కారణంగా ఆటపై దృష్టి సారించలేకపోతున్నామని, మ్యాచ్ సన్నద్ధత దెబ్బతింటోందని వాపోతున్న ఇరాన్.. ఇదే విషయాన్ని ఫిఫాకు తెలియజేయాలనకుంటోంది.
🚨 Iran will file a COMPLAINT against FIFA for their treatment at the 2026 World Cup. 🇮🇷⚖️
❌ Visas were refused.
❌ The team was only allowed to arrive one day before the match.
❌ They were forced to return immediately to Mexico. 🇲🇽The Iranian Football Federation believes it… pic.twitter.com/6LG8kYgmgN
— Transfer News Live (@DeadlineDayLive) June 19, 2026
జూన్ 21న బెల్జియంతో మ్యాచ్ ఉన్నందున రెండు రోజుల ముందే లాస్ ఏంజెల్స్ వెళ్లేందుకు అనుమితించాలని ఇరాన్ జట్టు కోరింది. కానీ, అమెరికా అధికారులు తిరస్కరించారు. ఇదే విషయాన్ని ఫిఫాకు ఫిర్యాదు చేయాలని ఇరాన్ బృందం భావిస్తోంది. మ్యాచ్ సన్నద్ధత గురించి ముందస్తుగానే అమెరికాకు తెలియజేశాం. అయినా నిర్వాహకుల తీరు కారణంగా ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు ఆంక్షలు ఎదుర్కొంటోంది. ఫలితంగా సాంకేతిక నిపుణుల సేవల్ని ఇరాన్ ఆటగాళ్లు కోల్పోతున్నారు అని ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్య మీడియా ప్రతినిధి వెల్లడించారు. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను నిలువరించిన ఇరాన్ 2-2తో డ్రా చేసుకున్న విషయం తెలిసిందే.