IPL: ఐపీఎల్ మీడియా రైట్స్ @ 60 వేల కోట్లు..?
హైదరాబాద్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కు బంగారు బాతులా దొరికిన ఐపీఎల్ త్వరలోనే మరో భారీ డీల్ కుదుర్చుకోవడానికి సిద్ధమౌతున్నది. 2023-28 కాలానికి గాను ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా బీసీసీఐకి వేల కోట్ల ఆదాయం రానున్నది. సుమారు రూ. 50 వేల కోట్ల హక్కులు అమ్ముడుపోయినట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఆ అంచనాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
వచ్చే ఐదేండ్ల కాలానికి గాను ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ దాదాపు రూ. 60 వేల కోట్లు ఆర్జించే అవకాశమున్నదని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఎలరా సెక్యూరిటీస్ అంచనా వేసింది. భారత్ లో క్రికెట్ కు ఉన్న క్రేజ్, నానాటికీ పెరుగుతున్నదని, ఐపీఎల్ విస్తృతి కారణంగా ఈ డీల్ ద్వారా బీసీసీఐ మరింత సంపన్న బోర్డుగా మారనున్నట్లు సదరు సంస్థ అంచనా వేసింది.
దీనిపై ఎలరా సెక్యూరిటీస్ స్పందిస్తూ.. ‘భారత్ లో క్రికటెకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఇటీవలే ముగిసిన ఐపీఎల్ ద్వారా స్పష్టమైందని, భారత్ లోని క్రీడల్లో క్రికెట్ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నదని, ఇది ఐపీఎల్ మీడియా హక్కుల వృద్ధికి ఊతమిస్తుందని ఆశిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ డీల్ వల్ల ప్రస్తుతం 54 శాతం ఉన్న ఐపీఎల్ వాటా 74 శాతానికి పెరిగే అవకాశముందని ఆ సంస్థ చెప్పింది.
గత నెలలో మీడియా హక్కులకు సంబంధించిన టెండర్ ను బీసీసీఐ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈనెల 12న ఇందుకు సంబంధించిన ఈ-వేలాన్ని నిర్వహించనున్నారు. ఈసారి ఐపీఎల్ మీడియా హక్కులను దక్కించుకోవడానికి బడా కంపెనీలన్నీ క్యూకట్టాయి. ఈ జాబితాలో ప్రస్తుతం బీసీసీఐ అధికారిక ప్రసారదారుగా ఉన్న డిస్నీ స్టార్ తో పాటు సోనీ నెట్వర్క్, వయాకామ్ రిలయన్స్, జీ ఎంటర్టైన్మెంట్, అమెజాన్, ఆపిల్, గూగుల్ లు బిడ్స్ వేశాయి. కాగా ఐపీఎల్ మీడియా హక్కుల కోసం కనీస ధర ను బీసీసీఐ రూ. 32,890 కోట్లుగా నిర్ణయించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- BCCI
- ipl
- IPL Media Rights
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

